Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Railway Accident | కదులుతున్న రైలు నుంచి ప‌డిపోయిన ప్రయాణికులు.. ఐదుగురు మృతి
Crime, National

Railway Accident | కదులుతున్న రైలు నుంచి ప‌డిపోయిన ప్రయాణికులు.. ఐదుగురు మృతి

Mumbra Railway Station Accident : థానే(Thane) లోని ముంబ్రా రైల్వే స్టేషన్‌లో ఘోర ప్ర‌మాదం (Railway Accident | కదులుతున్న రైలు నుంచి ప‌డిపోయిన ప్రయాణికులు.. ఐదుగురు మృతి) చోటుచేసుకుంది. CSMT నుండి లక్నో వెళ్తున్న రైలు నుంచి సుమారు 10 నుండి 12 మంది ప్రయాణికులు ట్రాక్‌పై పడిపోయారు. ప్రమాదానికి కారణం రైలులో జనసమూహం ఎక్కువగా ఉండడ‌మేన‌ని భావిస్తున్నారు. ప్రయాణీకులు తలుపులకు వేలాడుతూ ప్రయాణిస్తున్నారని, ఇదే సమయంలో ప‌లువురు ప్ర‌యాణికులు ప‌ట్టుత‌ప్పి జారి కింద‌ప‌డిపోయార‌ని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. సోమవారం, ముంబ్రా రైల్వే స్టేషన్ వద్ద లక్నో (Mumbai To Lucknow) కు వెళ్లే పుష్పక్ ఎక్స్‌ప్రెస్ (Pushpak Express) (12534) రైలు నుండి అనేక మంది ప్రయాణికులు పట్టాలపై పడిపోయారు, అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది. రైలులో ప్ర‌యాణికులు కిక్కిరిపోవ‌డంతో ఈ ప్రమాదం జరిగ...
Chhattisgarh | ఐడీఈ పేల్చిన మావోయిస్టులు.. అడిష‌న‌ల్ ఎస్పీ మృతి..
Crime

Chhattisgarh | ఐడీఈ పేల్చిన మావోయిస్టులు.. అడిష‌న‌ల్ ఎస్పీ మృతి..

Chhattisgarh Maoist Attack | ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా (Sukma) జిల్లాలో మావోయిస్టులు మ‌రో ఘాతుకానికి పాల్ప‌డ్డారు. దోండ్రా సమీపంలో పోలీసు వాహనాన్ని ఐఈడీ (IED Blast)తో పేల్చేశారు. ఈ ఘటనలో అదనపు ఎస్పీ ఆకాశ్‌ రావు గిరిపుంజే (Akash Rao Giripunje) ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో అనేక మంది పోలీసు అధికారులు, సిబ్బంది గాయపడ్డారని ఐజి బస్తర్ పి. సుందర్‌రాజ్ ధృవీకరించారు. “ఎఎస్‌పి ఆకాష్ రావు గిర్పుంజేకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం కొంటా ఆసుపత్రికి తరలిస్తుంగా ఆయ‌న మృతిచెందారు. గాయపడిన ఇతర సిబ్బంది పరిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని ఐజి తెలిపారు. IED పేలుడులో కొంటా SDPO, స్థానిక స్టేషన్ ఇన్‌ఛార్జ్ కూడా గాయపడ్డారు, వీరిద్దరూ చికిత్స పొందుతున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని మోహరించారు. ఈ సంఘటన తర్వాత, ఛత్తీస్‌గఢ్ పోలీసుల్లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. ASP గిర్పుంజే బలిదానం ఆ దళానికి తీవ్ర నష...
Earthquake | ప్రకాశం జిల్లాను వణికించిన భూకంపం..
Crime, AndhraPradesh

Earthquake | ప్రకాశం జిల్లాను వణికించిన భూకంపం..

నాలుగు సెకండ్లపాటు కంపించిన భూమి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలాల ప‌రిధిలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆదివారం అర్ధరాత్రి 12.47 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు (Earthquake) చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇండ్ల నుంచి ప్రజలు పరుగులు పెడుతూ రోడ్లపైకి వొచ్చారు. ఈ భూ ప్రకంపనలు సుమారు నాలుగు సెకండ్ల పాటు కొనసాగినట్లు స్థానికులు వెల్ల‌డించారు. గత మే నెల 6న కూడా ప్రకాశం జిల్లాలో ఇదే మాదిరిగా భూకంపం సంభవించింద‌ని తెలిపారు. పొదిలిలో ఉదయం 9.54 గంటల సమయంలో భూమి కంపించడంతో ఆ ప్రాంతం ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఆ సమయంలో కూడా సుమారు ఐదు సెకండ్లపాటు ప్రకంపనలు కొనసాగినట్లు నివేదికలు తెలిపాయి. కొత్తూరు పరిధిలోని రాజు హాస్పిటల్ వీధి, ఇస్లాంపేట, బ్యాంక్‌ కాలనీ త‌దిత‌ర ప్రాంతాల్లో స్పష్టంగా ప్రకంపనలు గుర్తించారు. తెలంగాణ‌లోనూ భూకంపం (Ea...
Maganti Gopinath | బీఆర్ఎస్ MLA మాగంటి గోపీనాథ్ కన్నుమూత
Crime

Maganti Gopinath | బీఆర్ఎస్ MLA మాగంటి గోపీనాథ్ కన్నుమూత

MLA Maganti Gopinath Passes Away | తెలంగాణ రాష్ట్ర‌ రాజకీయాల్లో విషాదం నెలకొంది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. దీర్ఘకాలంగా మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. గ‌త‌ గురువారం గుండెపోటుకు గురయ్యారు. చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిట‌ల్ కు తరలించగా గత మూడు రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గోపీనాథ్ ఆదివారం జూన్న‌ ఉదయం కన్నుమూశారు. చికిత్సకు ఆయన శరీరం ఏ మాత్రం స్పందించకపోవడంతో ఆసుపత్రిలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త బీఆర్ఎస్ శ్రేణుల్లో, నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) రాజకీయ ప్రస్థానం 1963న జూన్ 2 జన్మించిన మాగంటి గోపీనాథ్.. రాష్ట్ర‌ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయన మొదట తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి ప్ర‌వేశించారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీలో బీఏ పూర్తి చేసిన మాగం...
Medigadda Incident | మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరిలో ఆరుగురు యువకుల గల్లంతు
State

Medigadda Incident | మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరిలో ఆరుగురు యువకుల గల్లంతు

Medigadda Incident | జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally) జిల్లాలో శ‌నివారం రాత్రి వేళ‌ తీవ్ర విషాదక‌ర‌ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మహదేవపూర్ మండలం అంబటిపల్లి స‌మీపంలో మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) వద్ద గోదావరి నదిలో ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. గోదావరిలో శుక్రవారం సాయంత్రం స్నానానిక‌ని వెళ్లిన ఆరుగురు యువకులు తిరిగి బయటకు రాలేదు. మొత్తం 10 మంది వెళ్లగా అందులో ఆరుగురు గల్లంతయ్యారు. ఘటనపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) తీవ్ర‌ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే సహయక చర్యలు చేపట్టాలని అధికారుల‌ను ఆదేశించారు. కాగా నదిలో గ‌ల్లంత‌యిన‌వారిలో అంబటిపల్లికి చెందిన నలుగు యువకులు, కొర్లకుంటకు చెందిన ఇద్దరు యువకులు ఉన్న‌ట్లు స‌మాచారం. మహాదేవపుర్ ఎస్ఐ పవన్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని యువకుల కోసం గాలింపు చర్యలు చేప‌డుతున్నారు. గల్లంతైన యువకులు ఎవరు? స్నానానికి వెళ్లిన ...
error: Content is protected !!