Electricity Tariff | విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం కీలక ప్రకటన
Electricity Tariff in Telangana | హైదరాబాద్: వేసవిలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి పెరుగుతున్నప్పటికీ, 2025-26 సంవత్సరానికి విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీలను పెంచేది లేదని స్పష్టం చేసింది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ (ERC) చైర్మన్ జస్టిస్ డి. నాగార్జున్ ముందు రాష్ట్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ ఇంధన కార్యదర్శి ఎస్. ప్రియదర్శిని హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వినియోగదారులపై భారం పడకుండా విద్యుత్ సంస్థలకు పూర్తి ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు.
Electricity Tariff : ఆర్థిక మద్దతు కొనసాగిస్తాం..
ఏ కేటగిరీకీ విద్యుత్ ఛార్జీల పెంపు (Electricity Tariff ) ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2003 విద్యుత్ చట్టం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు ఆర్థిక సహాయం అందించడానికి కట్టుబడి...




