Case Filed Against KTR | ఫేక్ న్యూస్ వివాదం.. కేటీఆర్‌పై కేసు నమోదు
Case Filed Against KTR : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ (Telangana Rashtra Samithi (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ( KT Rama Rao (KTR)పై ఫేక్ న్యూస్ ప్రసారం (spreading fake news) ఆరోపణలతో నల్లగొండ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. నకిరేకల్ మునిసిపల్ చైర్‌పర్సన్ చౌగోని రజిత (Nakrekal Municipal Chairperson Chougoni Rajitha) ఇచ్చిన ఫిర్యాదుతో ఈ చర్య తీసుకున్నారు.
ఫేక్ న్యూస్ ఆరోపణలపై వివాదం
తనపై తప్పుడు సమాచారంతో దుష్ప్రచారం ( spreading fake news) చేశారని ఆరోపిస్తూ నల్లగొండ జిల్లాలోని నాకిరేకల్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చౌగోని రజిత (Chougoni Rajitha) పోలీసు అధికారులను ఆశ్రయించారు. ముఖ్యంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తెలుగు ప్రశ్నపత్ర లీకేజీ కేసులో తనను అనవసరంగా లాగుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులో...




