Ratha Saptami | తిరుమలలో వైభవంగా రథసప్తమి.. కనుల పండువగా వేడుకలు
Ratha Saptami : తిరుమల (Tirumala)లో రథసప్తమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఘట్టం భక్తులకు కనుల విందు చేసింది. రథసప్తమి ఉత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams (TTD) లో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. ఈ ఏడాది కూడా ఇక్కడ విస్తృత ఏర్పాట్లు జరిగాయి. మాడ వీధుల్లో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో జె. శ్యామలరావు ( (Executive Officer (EO) Shyamala Rao), అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. గ్యాలరీల్లో అన్న ప్రసాదం పంపిణీ, తాగునీరు, మరుగుదొడ్లు, షెడ్లు తదితర సౌకర్యాలను ఈవో పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పటిష్ట భద్రత నడుమ Ratha S...




