Veteran actress Krishnaveni | అలనాటి సినీ నటి కృష్ణవేణి ఇక లేరు
అలనాటి ప్రముఖ నటి, గాయని, నిర్మాత సి.కృష్ణవేణి (Veteran actress Krishnaveni) ఇకలేరు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని తన స్వగృహంలో ఆమె కన్నుమూశారు. కృష్ణవేణికి 102 ఏళ్లు. వయోభారం కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తుది శ్వాస విడిచారు.
సతీ అనసూయ సినిమాతో Krishnaveni తెరగేట్రం
చిత్తజల్లు కృష్ణవేణి (Chittajallu Krishnaveni) 1924 డిసెంబరు 24న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామంలో జన్మించారు. చిన్ననాటి నుంచి కళల పట్ల ఆసక్తి చూపిన ఆమె పాటలు పాడుతూ, నాటకాలు వేస్తూ ఆకట్టుకొనేవారు. కృష్ణవేణి సినీ ప్రస్థానం 1936లో ప్రారంభమైంది. 'సతీ అనసూయ' సినిమాతో ఆమె తెరగేట్రం చేశారు. అందం, అభినయం, మధురమైన గాత్రంతో సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ చిత్రం తర్వాత కృష్ణవేణి తెలుగు, తమిళ భాషల్లో అనేక సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింప...




