Smart Phone: ఎక్కువ సేపు రీల్స్ చూస్తున్నారా.. బీ కేర్!
Smart Phone : నిరంతరంగా యూట్యూబ్‌లో షార్ట్ వీడియోలు (YouTube Shorts), ఇస్టాగ్రామ్‌లో రీల్స్ (Insta Reels) చూస్తున్నారా? అయితే.. అలర్ట్‌గా ఉండాల్సిందే. చిన్న వీడియోలు వీక్షిస్తూ కాలక్షేపం చేసేవారిలో అధిక రక్తపోటు (హైబీపీ) సమస్య రావచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా యువత, మధ్య వయసు ఉన్నవారు దీని బారిన పడొచ్చని హెచ్చరిస్తున్నారు. నిరంతరంగా షార్ట్ వీడియోలు, రీల్స్ (Reels) చూసే వారిలో హైబీపీ(High BP) అనే సమస్య పెరుగుతోందని ఓ అధ్యయనంలో తేలింది.
అధ్యయనం ఏం చెబుతోందంటే…
చైనాలోని హెబీ మెడికల్ యూనివర్శిటీ (HB Medical University) కి చెందిన ఫస్ట్ హాస్పిటల్ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. కంటిన్యూగా చిన్న వీడియోలు చూడ్డం అనర్థదాయమని ఇందులో వెల్లడైంది. 4,318 మంది యువకులు, మధ్యవయస్కులపై అధ్యయనం చేయగా ఈ షాకింగ్ ఫలితాలు వచ్చాయి. నిద్రకు ముందు చిన్న వీడియో...




