Freebies | ఉచితాల వల్ల ప్రజలు పనిచేయడం మానేస్తారు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
New Delhi : ఎన్నికలకు ముందు " ఉచిత బహుమతులు (Freebies ) " ప్రకటించే పార్టీలపై భారత సుప్రీంకోర్టు బుధవారం తీవ్రంగా మండిపడింది . ఇటువంటి పథకాలు తరచుగా ప్రజలను పని చేయకుండా చేస్తాయని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కాకుండా అడ్డుకుంటాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎన్నికలకు ముందు ఉచితాలను ప్రకటించే పద్ధతిని సుప్రీంకోర్టు ఖండిస్తూ, ఉచిత రేషన్, డబ్బు లభిస్తున్నందున ప్రజలు పని చేయడానికి ఇష్టపడటం లేదని పేర్కొంది. నైట్ షెల్టర్లకు సంబంధించిన కేసును విచారిస్తూ జస్టిస్ బిఆర్ గవై, అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం చేసిన తాజా వ్యాఖ్యలు అందరిన్నీ ఆలోచింపజేస్తున్నాయి."దురదృష్టవశాత్తు, ఈ ఉచితాల కారణంగా… ప్రజలు పని చేయడానికి ఇష్టపడటం లేదు. వారికి ఉచిత రేషన్లు అందుతున్నాయి. వారు ఎటువంటి పని చేయకుండానే నగదు పొందుతున్నారు" అని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు.
Freebies తో పరాన్న జీవులను సృష్టిస్తున్నా...




