Balakrishna | బాలయ్యకు పోటీగా ఆది పినిశెట్టి..?
Tollywood News | వరుస హిట్లతో నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandhamuri Balakrishna) మంచి జోరు మీద ఉన్నారు. లేటెస్ట్ గా బాబి దర్శకత్వంలో వచ్చిన డాకు మహారాజ్(Daku Maharaj) తో హిట్టుకొట్టాడు. వెంటనే అఖండకి సీక్వెల్ గా అఖండ -2 సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. ఈ మూవీ సెప్టెంబర్ లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
బాలయ్య-బోయపాటి (Balayya -Boyapati) కాంబినేషన్ అంటేనే ఒక మాస్ క్రేజ్ ఆడియన్స్ లో పెరిగిపోతుంది. అంచనాలకు మించేలా వీరి కాంబినేషన్లో వచ్చిన మూవీస్ హిట్ అయ్యాయి. మొదటిసారిగా సింహా మూవీతో వీళ్ళు చేతులు కలిపారు. అప్పటివరకు సీనియర్, జూనియర్ డైరెక్టర్లతో పని చేసిన బాలయ్య ప్లాపులనే చవిచూశాడు. సింహాతో బాలయ్య మళ్ళీ తన మునుపటి ఫామ్ ని అందుకున్నాడు.
ఏ ముహూర్తాన చేతులు కలిపారో కానీ ఇప్పటివరకు మూడు సినిమాలు తీసి ఒక దానికి మించి మరొకటి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు. ఇండస్ట్రీలో వీళ్ళ కాంబినేషన్లో మూవీ వస్త...




