ACB | ఏసీబీ ఎదుట కేటీఆర్… విచారణకు హాజరు
భారతీయ రాష్ట్రీయ సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీ రామారావు (KTR) అవినీతి నిరోధక సంస్థ (ACB) ఎదుట హాజరయ్యారు. ఫార్ములా -ఈ అక్రమాల కేసులో ఆయన్ను ఏసీబీ ప్రశ్నించనుంది. అవినీతి నిరోధక చట్టం, క్రిమినల్ మిసాప్రోప్రియేషన్, క్రిమినల్ మిస్‌కండక్ట్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, క్రిమినల్ కన్‌స్పిరసీకి సంబంధించిన IPC సెక్షన్ల కింద కేసులను కేటీఆర్ (KT Rama Rao) ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఖజానాకు సుమారు ₹55 కోట్ల నష్టం కలిగించాయని ప్రధాన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై ఈ కేసులు నమోదయ్యాయి.
న్యాయవాది తోడుగా రాగా..
విచారణ సమయంలో కేటీఆర్ తరఫు న్యాయవాదిని హైకోర్టు అనుమతించింది. అయితే.. ఏసీబీ ప్రశ్నించే సమయంలో న్యాయవాది జోక్యం అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. దూరం నుంచి చూసేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ తరఫున ఏసీబీ కార్యాలయానికి ప్ర...




