Konda Surekha | నా సమస్యలను కాంగ్రెస్ పెద్దలకు వివరించా
                    Hyderabad | ఇటీవల తనపై జరుగుతున్న పరిణామాలపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) మరోసారి స్పందించారు. పార్టీ పెద్దలతో సమావేశమైన తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. తాజా పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి నాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తో మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత చర్చించారు. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను వివరించారు. బుధవారం రాత్రి తన ఇంటి వద్దకు పోలీసులు వచ్చిన సమయంలో జరిగిన విషయాలను వారికి వివరించారు. భేటీ అనంతరం కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. తన సమస్య పరిష్కరించేం దుకు ప్రయత్నిస్తామని వారు హామీ ఇచ్చారు. మిగిలిన విషయాలు వారే చూసుకుంటారని భరోసాతో వెళ్తున్నానని మంత్రి సురేఖ వెల్లడించారు.
గత కొన్ని రోజులుగా తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేసు...                
                
             
								



