Sarkar Live

Author: Pramod Sarkar

ప్ర‌మోద్ స‌ర్కార్‌.. డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Hydra | మ‌ళ్లీ రంగంలోకి హైడ్రా.. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభం
State

Hydra | మ‌ళ్లీ రంగంలోకి హైడ్రా.. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభం

హైదరాబాద్: హైద‌రాబాద్‌లో అక్ర‌మ నిర్మాణాల‌పై ఉక్కుపాదం మోపేందుకు హైడ్రా మ‌ళ్లీ రంగంలోకి దిగింది. ఈమేర‌కు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) ఆదేశాలతో నిజాంపేట్‌ మున్సిపల్‌ పరిధి తుర్కచెరువు పరిసర ప్రాంతాల్లోని అక్రమంగా నిర్మించిన కట్టడాలను మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. నిజాంపేట్‌ మునిసిపల్‌ కమిషనర్‌, బాచుపల్లి తహసీల్దార్ల ఆధ్వర్యంలో సర్వే నంబరు 334లో వెలిసిన అక్రమ నిర్మాణాలను టౌన్‌ప్లానింగ్‌, రెవెన్యూ సిబ్బంది ఎక్సకవేటర్‌తో కూల్చివేశారు. తుర్కచెరువు బఫర్‌ జోన్‌లో ఉన్న నాలుగు గదులను కూడా నేల‌మ‌ట్టం చేశారు. కార్య‌క్ర‌మంలో రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు నరేందర్‌రెడ్డి, భానుచందర్‌, ప్రశాంతి పాల్గొన్నారు....
Dharani Portal | ధరణి ధరఖాస్తులకు ఇకపై త్వరలో పరిష్కారం.. కొత్త మార్గదర్శకాలు ఇవే..
State

Dharani Portal | ధరణి ధరఖాస్తులకు ఇకపై త్వరలో పరిష్కారం.. కొత్త మార్గదర్శకాలు ఇవే..

Dharani Portal | రాష్ట్ర వ్యాప్తంగా కొన్నాళ్ల నుంచి ధరణి అప్లికేషన్లు భారీగా పెండింగులో ఉన్నాయి. వాటిని వెనువెంటనే పరిష్కరించేందుకు అధికారాలను రాష్ట్రభుత్వం వికేంద్రీకరించింది. ఆర్డీవో, అదనపు కలెక్టర్లు(రెవెన్యూ)కు మరిన్ని బాధ్యతలను, అధికారాలను కట్టబెట్టింది.ధరణి కమిటీ సిఫారసుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ గురువారం  సర్క్యులర్ జారీ చేశారు. గత మూడు రోజుల క్రితమే అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. గతంలోనూ ప్రతి దరఖాస్తును ఎన్ని రోజుల్లో పరిష్కరించాలో స్పష్టం చేసినప్పటికీ అమలుకు నోచుకోలేదు. నెలల తరబడి దరఖాస్తుదారులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకున్నారు. సమస్య పరిష్కారం కోసం మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకునేవారు.. అయితే ఈ సారైనా సీసీఎల్ఏ జారీ చేసిన ఆదేశాలను తహశీల్దార్లు, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లు పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆర్డీవో స్థాయి: టీఎం 4. అసైన్డ్ భూమ...
Rain Alert | తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు భారీ వర్షాలు..!
State

Rain Alert | తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు భారీ వర్షాలు..!

Rain Alert | తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ (IMD) వెల్ల‌డించింది. నవంబర్‌ 30 ‌నుంచి డిసెంబర్‌ 2‌వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని అంచనా వేసింది. ఈమేర‌కు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం నెమ్మదిగా కదులుతోందని, గడిచిన 6 గంటల్లో గంటకు 2 కిమీ వేగంతో కదులుతుందని ఐఎండీ పేర్కొంది. చెన్నైకి 480 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. వొచ్చే  12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి ఉత్తర-వాయువ్య దిశగా పయనమవుతుందని అంచనా వేసింది. ఉదయంలోపు తుపానుగా మారే చాన్స్‌ ఉందని ఐఎండీ వివరించింది.శనివారం (నవంబర్‌ 30‌వ తేదీ) ఉదయం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకాల్‌, ‌మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని తాజా బులెటిన్‌ ‌లో పేర్కొంది. ఈ ప్రభావంతో 3 రోజులు ఏపీలోని దక్షిణకోస్తాలో ...
Tenth Class Marks System | పదో తరగతి మార్కుల విధానంలో భారీ  మార్పులు
State

Tenth Class Marks System | పదో తరగతి మార్కుల విధానంలో భారీ మార్పులు

Tenth Class Marks System : రాష్ట్రంలోని పదో తరగతి మార్కుల విధానంలో భారీ మార్పులకు పాఠశాల విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇకపై పదో తరగతి పరీక్షలను 100 మార్కులకే నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం పదో తరగతిలో 20 ఇంటర్నల్‌ మార్కులు, 80 మార్కులకు ఫైనల్‌ పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఇంటర్నల్‌ మార్కుల విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఇక నుంచి 100 మార్కులకు తుది పరీక్షలను నిర్వహించనున్నారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త విధానం అమలులోకి వస్తుందని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది....
Food Safety Committees | రాష్ట్రంలోని గురుకులాలు హాస్ట‌ళ్ల‌లో ఇక‌పై ఫుడ్ సేఫ్టీ క‌మిటీలు..
State

Food Safety Committees | రాష్ట్రంలోని గురుకులాలు హాస్ట‌ళ్ల‌లో ఇక‌పై ఫుడ్ సేఫ్టీ క‌మిటీలు..

Food Safety Committees | రాష్ట్రంలోని గురుకులాలు, వ‌స‌తిగృహాల్లో వ‌రుస‌గా చోటుచేసుకుంటున్న ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు పూనుకుంది. రాష్ట్రంలోని గురుకులాలు, హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు(Food Safety Committees) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(CS ShanthiKumari) తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆహారభద్రతపై ముగ్గురు సభ్యులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, విద్యాసంస్థ అధికారి, జిల్లాస్థాయి అధికారులు ఆ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపారు. కాగా గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్ధిపేటలోని గురుకుల పాఠశాలలను తనిఖీ చేసి.. ఆహార పదార్థాలను, కనీస వసతులను స్వ‌యంగా పరిశీలించారు. హాస్టళ్ల పర్యవేక్షణపై ప్రభుత్వం కమిటీలను నియమిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక...
error: Content is protected !!