Tibet earthquake | టిబెట్‌లో భారీ భూకంపం.. 95 మంది మృతి.. 130 మందికి గాయాలు
Tibet earthquake : టిబెట్‌లో ఈ రోజు భారీ భూకంపం సంభవించింది. దీంతో 95 మంది మృతి చెందారు. 130 మందికి పైగా గాయపడ్డారు. ఈ మేరకు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈ భూకంపం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు (జీఎంటీ 01:00) జరిగింది. టిబెట్ (Tibet) పవిత్ర నగరం శిగత్సే వద్ద సంభవించింది. దీని తీవ్రత 7.1గా నమోదైంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో (6 మైళ్ల లోతు) ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అదే ప్రాంతంలో పలు ఆఫ్టర్‌షాక్స్ (అనంతర ప్రకంపనలు) కూడా నమోదయ్యాయి. ఇవి పొరుగు దేశాలైన నేపాల్ (Nepal), భారత్ (India)లోని కొన్ని ప్రాంతాల్లో కూడా కనిపించాయి.
Tibet earthquake : పవిత్ర నగరం శిగత్సే
శిగత్సే టిబెట్‌లో పవిత్ర నగరం. ఇది పాంచెన్ లామా అనే ముఖ్యమైన బౌద్ధ ఆధ్యాత్మిక గురువు స్థానం.టిబెట్‌ను చైనా (China) 1950లో ఆక్రమించింది. అనంతరం అక్కడి జనం అనేక ఆంక్షల మధ్య జీవిస్తున్నారు. ...




