Food Poisoning | స్కూళ్లలో ఫుడ్‌పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్
                    Food Poisoning | హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురి అయిన ఘటనపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. వెంటనే ఆయా పాఠశాలల నుంచి మధ్యాహ్న భోజనం నమూనాలను ల్యాబ్‌ల కు పంపించాలని ఆదేశించింది. నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్‌పై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)పై కోర్టు తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీసిన హైకోర్టు.. ఫుడ్ పాయిజన్ వల్ల పిల్లలు చనిపోతే మాత్రం స్పందించరా అని ప్రశ్నించింది. అధికారులకు కూడా పిల్లలు ఉన్నారని.. మానవతా దృక్పథాన్ని అలవర్చుకోవాలని అధికారులకు తలంటింది.
ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడంపై కోర్టు ప్రభుత్వాన్ని కూడా నిలదీసింది. ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుని వొచ్చే సోమవారంలోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారం రోజుల వ్యవధిలో ఇదే పాఠశ...                
                
             
								



