Isha Ambani | రంగులు మారే కారు.. ఇషా అంబానీ సొంతం.. ధర ఎంతంటే..?
Isha Ambani : భారతదేశ దిగ్గజ వ్యాపారి, అత్యంత ధనవంతుడు ముకేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ ఇటీవల ముంబై వీధుల్లో బెంట్‌లీ బెంటేయ్గా SUV (Bentley Bentayga SUV) లో కనిపించారు. ఈ కారును ప్రత్యేకమైనది… అద్భుత ఫీచర్స్ కలిగి ఉంటుంది. ముఖ్యంగా సూర్యకాంతిలో దానంతట అదే ఆటోమెటిక్‌గా రంగులను మార్చుకుంటుంది. దీని ధర కోట్లలోనే ఉంటుంది. విలాసవంత జీవితం గడుపుతున్న అంబాని కుటుంబంలో ఉన్న అత్యధిక ఖరీదైన కార్ల జాబితాలో ఇది కూడా వచ్చి చేరింది.
అత్యంత ఖరీదైన కారు
ఇషా అంబానీ బెంట్‌లీ బెంటేయ్గా V8తో ఇటీవల నటుడు రణబీర్ కపూర్ నివాసం వద్ద కనిపించింది. ఆమె వద్ద మెర్సిడెస్ G-వాగన్, ఇతర విలాసవంతమైన వాహనాలు కూడా ఉన్నాయి. కొత్తగా ఆమె కొన్న కారు మరింత విలాసమైనది. అత్యధిక ఖరీదైనది.
రంగులు ఎలా మార్చుకుంటుందంటే..
ఇషా అంబానీ (Isha Ambani)కి చెందిన బెంట్‌లీ బెంటేయ్గా మొదట తెలుపు రంగులో ఉంటుంది. దీన...




