Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Kaleshwaram Case: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్లపై విచారణ
State

Kaleshwaram Case: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్లపై విచారణ

Kaleshwaram Case : హైకోర్టులో కేసీఆర్, హరీశ్ రావు మధ్యంతర పిటిషన్లపై మంగళవారం విచారణ జరుగనుంది. కాళేశ్వరం విచారణను సీబీఐకి ఇస్తామనే ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కేసీఆర్, హరీశ్ రావు కోరుతూ మధ్యంతర పిటిషన్ వేశారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తున్నదని ఆరోపిస్తూ మంగళవారం బీఆర్ఎస్ పార్టీ (BRS party) రాష్ట్రవ్యాప్తంగా నేడు , రేపు ధర్నాలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ నేతలు వివిధ రూపాల్లో నిరసన తెలపనున్నారు. ధర్నాలు, రాస్తారోకాలు, బైక్ ర్యాలీలు నిర్వహించడానికి పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను స...
Heavy Rain Alert | నేడు, రేపు భారీ వ‌ర్షాలు
State

Heavy Rain Alert | నేడు, రేపు భారీ వ‌ర్షాలు

Heavy Rain Alert | తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన ప్ర‌భావంతో నేడు, రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయని హైద‌రాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నేడు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చ‌రించింది. వరంగల్‌, హన్మకొండ, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, ములుగు, కరీంనగర్‌, కొత్తగూడెం, జగిత్యాల, ఖమ్మం, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rain Alert) కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్‌, జనగామ‌, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, మెదక్‌, నల్గొండ, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురవ‌నున్నాయ‌ని పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున ఆంధ‌ప్ర‌దేశ్ లోని విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ ...
Kaleshwaram : కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు.. హరీష్ రావుపై నిప్పులు
State

Kaleshwaram : కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు.. హరీష్ రావుపై నిప్పులు

బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వరం (Kaleshwaram )పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్‌రావుపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. “కేసీఆర్‌పై నిందలు రావడానికి ప్రధాన కారణం హరీష్‌రావేనా? ఆయన వెనుక సంతోష్‌, సీఎం రేవంత్‌ ఉన్నారా? నా మీద పెద్ద ఎత్తున కుట్రలు జరిగాయి. మా నాన్నపై సీబీఐ ఎంక్వైరీకి కారణం అదే. నా కడుపు రగిలిపోతుంది” అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. “మా నాన్న కేసీఆర్‌కి తిండి మీదా, డబ్బు మీదా ఎలాంటి ఆపేక్ష లేదు. ఆయన తరతరాల సంపదను తెలంగాణ ప్రజలకే ఇచ్చారు. కానీ ఆయన పక్కన ఉన్న కొందరి వల్లే ఈ పరిస్థితే వచ్చింది. కాళేశ్వరం వివాదం మొత్తం అప్పటి మంత్రి హరీష్‌రావు వల్లే జరిగింది. కేసీఆర్‌కి అవినీతి మరక ఎలా వచ్చింది అనేది అందరూ చూడాలి. కేసీఆర్‌పై విచారణ తర్వాత కూడా బీఆర్‌ఎస్‌ నిలుస్తుందా లేదా అన్నది చూడాలి” అని ఆమె వ్యాఖ్యానించారు. “నేను ఇలా మాట్లాడితే పార్టీకి స్థాని...
Accident | వేర్వేరు ప్ర‌మాదాల్లో 8 మంది మృతి
Crime, Mahaboobnagar

Accident | వేర్వేరు ప్ర‌మాదాల్లో 8 మంది మృతి

Mahbubnagar Bus Accident : మహబూబ్ నగర్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ట్రైలర్ ట్రక్కును ఒక ప్రైవేట్ బస్సు వెనుక నుండి ఢీకొట్టిన ప్రమాదం (Accident) లో నలుగురు మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. అడ్డకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, గాయపడిన ఐదుగురిని ఆసుపత్రికి తరలించగా, ఒకరు చికిత్స పొందుతూ మరణించారని తెలిపారు. 32 మంది ప్రయాణికులతో బస్సు హైదరాబాద్ నుండి ప్రొద్దుటూరుకు వెళుతుండగా బస్సు ప్రమాదవశాత్తు ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. గ‌ణేష్ ఊరేగింపులో.. West Godavari Accident : పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలో గణేష్ ఊరేగింపు సందర్భంగా ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడి, ఒక మైనర్ సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గణేష్ ...
Legislative Council: శాసనమండలిలో కీలక బిల్లులకు ఆమోదం
State

Legislative Council: శాసనమండలిలో కీలక బిల్లులకు ఆమోదం

Hyderabad : తెలంగాణ శాసన మండలి (Legislative Council) సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మూడు కీలక బిల్లులను మండలి ఆమోదించింది. పంచాయతీ రాజ్ చట్ట సవరణ, పురపాలక సంఘాల చట్ట సవరణ, అల్లోపతిక్ ప్రైవేటు వైద్య సంరక్షణ సంస్థల చట్టం రద్దు బిల్లులకు లెజస్లేటివ్ కౌన్సిల్ ఆమోద ముద్ర వేసింది. ఒక‌వైపు బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు కొన‌సాగుతుండ‌గానే మండలిలో ఈ బిల్లులు ఆమోదం పొందాయి. ఇదిల ఉండ‌గా బీఆర్ఎస్ సభ్యులు త‌మ నిర‌స‌న‌ల‌ను ముమ్మ‌రం చేశారు. చైర్మన్‌ పోడియం వ‌ద్ద‌కు వెళ్లి నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్ట‌డంతో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది. దీంతో శాసన మండలిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాళేశ్వరం కమిషన్‌ నివేదిక పేపర్లు చింపి మండలి చైర్మన్‌పై విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీకు సీబీఐ వద్దు.. రేవంత్‌కు సీబ...
error: Content is protected !!