అక్రమ మట్టి రవాణాపై పోలీసుల మెరుపు దాడి: జేసీబీ, 6 ట్రాక్టర్లు సీజ్
గీసుగొండ మండల పరిధిలోని చంద్రయ్యపల్లి గ్రామ శివారులో అక్రమంగా మట్టిని తరలిస్తున్న ముఠాపై గీసుగొండ పోలీసులు విరుచుకుపడ్డారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతున్న ఒక జేసీబీతో పాటు ఆరు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.గీసుగొండ సి ఐ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం ..చంద్రయ్యపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమి నుండి కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీ సహాయంతో మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిపై తక్షణమే స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తవ్వకాలను అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసి, నిందితులపై కేసులు నమోదు చేశారు.
నిందితుల వివరాలు:
ఈ కేసులో మొత్తం ఏడుగురిని నిందితులుగా గుర్తించారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి:
గండికోట సతీష్ (మనుగొండ)
గాడు...




