Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
సహస్ర హత్య కేసులో షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించిన సీపీ – Sahasra Murder Case
Crime

సహస్ర హత్య కేసులో షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించిన సీపీ – Sahasra Murder Case

Sahasra Murder Case | కూకట్‌పల్లి సహస్ర హత్య కేసులో సీపీ అవినాష్ మహంతి విస్తుపోయే వాస్త‌వాలు మీడియాకు వెల్ల‌డించారు. 14 ఏళ్ల పిల్లాడే త‌న ఇంటి ప‌క్క‌న ఉంటున్న సహస్రను హత్య చేశాడని తెలిపారు. ఆయ‌న క‌థ‌నం ప్ర‌కారం.. సహస్ర తమ్ముడితో త‌ర‌చూ క్రికెట్ ఆడే నిందితుడికి ఆ పిల్లాడి వ‌ద్ద క్రికెట్ బ్యాట్ నచ్చింది. కానీ సహస్ర తమ్ముడు ఎక్కువగా ఆ బ్యాట్‌ని నిందితుడికి ఇచ్చేవాడు కాదు. ఎలాగైనా ఆ బ్యాట్ ను తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న 14 ఏళ్ల నిందితుడు.. దాని కోసమే స‌హ‌స్ర‌ ఇంటికి వెళ్లాడు. బ్యాట్ తీసుకొని.. వెనక్కి వస్తుండగా.. అదే స‌మ‌యంలో సహస్ర చూసి కేకలు వేసింది. వెంట‌నే స‌ద‌రు నిందితుడు ఆమెను బెడ్‌రూంలోకి తీసుకెళ్లాడు. అంతటితో ఆగ‌కుండా కత్తితో పాశ‌వికంగా పొడిచేశాడని పోలీసులు వెల్ల‌డించారు. మరి ఆ బ్యాట్‌ని తల్లిదండ్రుల ద్వారా కొనిపించుకోవచ్చు కదా అంటే.. ఆ పిల్లాడు.. అంత ఖరీదైన బ్యాట్‌ని తన తల్లిదండ్...
Suryapet | పట్టపగలే అందరూ చూస్తుండగానే హత్యాయత్నం
Crime

Suryapet | పట్టపగలే అందరూ చూస్తుండగానే హత్యాయత్నం

Suryapet news | సూర్యాపేటలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే బైక్ పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను హత్య చేయడానికి దుండగులు కారులో వెంబడించారు. ఈ సంఘటన సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని బీబీగూడెం సమీపంలోని ఓ వైన్స్ ముందు తీవ్ర భయాందోళనలు సృష్టించింది. వివరాల్లోకి వెళితే సూర్యాపేట ఖమ్మం క్రాస్ రోడ్ నుంచి శుక్రవారం బైక్ పై వెళ్తున్న ముగ్గురిని (ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు) గుర్తుతెలియని వ్యక్తులు కారులో వెంబడించగా బీబీ గూడెం సమీపంలో ఉన్న ఓ వైన్స్ షాపు ముందు బైక్ బయటపడవేసి ఆందోళనతో వైన్స్ లోపలికి వెళ్లారు. బైక్ ను వెంబడిస్తూ వస్తున్న దుండగులు కారు నుంచి దిగి ఆ ముగ్గురిని చంపడానికి కత్తులు, కర్రలతో వైన్స్ వైపు పరుగెత్తారు. ఈ క్రమంలో వైన్స్ షాప్ లో ఉన్న వారు ఒక్కసారిగా బయటికి రావడంతో వారిని చూసి కారెక్కి పారిపోయారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చ...
Aarogyasri | ఆగస్టు 31 నుండి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తాం : నెట్‌వర్క్ ఆసుపత్రులు
State, Hyderabad

Aarogyasri | ఆగస్టు 31 నుండి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తాం : నెట్‌వర్క్ ఆసుపత్రులు

Aarogyasri | “ఆరోగ్యశ్రీ, EHS (ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ) JHS (జ‌ర్న‌లిస్ట్ హెల్త్ స్కీమ్‌) ల లబ్ధిదారులకు ఉచిత వైద్య‌ సేవలను అందించడంలో అనేక సమస్యలు ఎదుర‌వుతున్నాయి. ఆర్థికంగా పెనుభారం మోస్తున్నామ‌ని ఆరోగ్య‌శ్రీ (Aarogyasri) నెట్ వ‌ర్క్ ఆసుపత్రులు చాలా వరకు మూసివేయబడే ప్రమాదం పొంచి ఉందని TANHA తెలిపింది. ఈ సంవత్సరం జనవరిలో, TANHA సభ్యులు ఇలాగే నిరసన తెలుప‌గా రాష్ట్ర ప్రభుత్వం వారి డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. అయితే, ఎనిమిది నెలలు గడుస్తున్నా.. అనేక సమావేశాలు జరిగినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదు. TANHA యొక్క కొన్ని ప్రధాన డిమాండ్‌లు చేస్తోంది. సభ్య ఆసుపత్రులతో అవగాహన ఒప్పందాలను (నిబంధనలు షరతులు) తిరిగి రూపొందించడం, ప్యాకేజీల సవరణ, సాధారణ చెల్లింపులు, పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం, ఎటువంటి ఆందోళన లేదా పరిశీలన లేకుండా ఏకపక్షంగా సర్క్యులర్‌లను జా...
Mnister Seethakka |  మంత్రి కొండా సురేఖకు ఎలాంటి విభేదాలు లేవు
State

Mnister Seethakka | మంత్రి కొండా సురేఖకు ఎలాంటి విభేదాలు లేవు

Hyderabad News | త‌న‌కు మంత్రి కొండా సురేఖ‌ (Minister Konda Surekha) కు మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని మంత్రి సీతక్క (Mnister Seethakka ) స్ప‌ష్టం చేశారు. రాజకీయాల్లో ఆడబిడ్డలను ఎదగనివ్వాలని, సమాజంలో ఆడబిడ్డలు ఎదుగుతుంటే ఓర్వలేక పోతున్నార‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఇంట్లో సమాజంలో ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే సమాజం బాగుంటుంది గతసారి అనారోగ్యం.. సొంత పనుల వల్ల కొండా సురేఖ రాలేకపోయారు. వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొండా సురేఖ ఉన్నారు. మా మధ్య రాజకీయ విభేదాలు తప్పితే వ్యక్తిగత విభేదాలు లేవు. మేము సమ్మక్క సారలమ్మ మాదిరిగా అక్కాచెల్లెళ్ల లాగా కలిసే ఉన్నామ‌ని మంత్రి సీత‌క్క స్ప‌ష్టం చేశారు. మేడారం సమ్మక్క సారక్క జాతర (Medaram Jathara 2026) పై గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. మేడారం జాతరకు గతంలో ఎన్నడూ లేని విధంగా 150 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింద‌ని, వచ్చే సంవత్స‌రం సమ్మక్క సారక్క జాతర జనవరి...
Telangana Rains | మ‌రో రెండురోజులు భారీ వ‌ర్షాలు..
Hyderabad, State

Telangana Rains | మ‌రో రెండురోజులు భారీ వ‌ర్షాలు..

Telangana Rains | తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కుర‌వ‌నున్నాయ‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఈమేర‌కు గురువారం ఆదిలాబాద్‌, కొత్తగూడెం, హైదరాబాద్‌, జగిత్యాల, జ‌య‌శంక‌ర్‌ భూపాలపల్లి, కరీంనగర్‌, ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, మంచిర్యాల, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, ములుగు, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో వర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పేర్కొంది. ఇక శుక్రవారం భ‌ద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షపాతం ఉండే సూచనలున్నాయని తెలిపింది. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయం...
error: Content is protected !!