Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
హైదరాబాద్‌లో ‘కిల్లర్’ అల్లం-వెల్లుల్లి పేస్ట్:  మీ వంటల్లో విషం కలిపే ముఠా గుట్టురట్టు! – Adulterated Ginger Garlic Paste
Crime, Hyderabad

హైదరాబాద్‌లో ‘కిల్లర్’ అల్లం-వెల్లుల్లి పేస్ట్: మీ వంటల్లో విషం కలిపే ముఠా గుట్టురట్టు! – Adulterated Ginger Garlic Paste

Adulterated Ginger Garlic Paste Hyderabad : నగరవాసుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మరో ఆహార కల్తీ ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ అధికారులు రట్టు చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, ఫంక్షన్లకు సరఫరా అవుతున్న నాసిరకం, విషపూరితమైన అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాన్ని గుర్తించి భారీ ఎత్తున నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నగరవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కాటేడాన్‌లో ‘విషం’ తయారీ: దాడి వివరాలు ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్, హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందాలు సంయుక్తంగా మైలార్‌దేవ్‌పల్లి ఐడిఎ (IDA) పరిధిలోని కాటేడాన్‌ ప్రాంతంలో ఉన్న ఒక తయారీ యూనిట్‌పై మెరుపు దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు రూ. 22 లక్షల విలువైన కల్తీ సామాగ్రిని అధికారులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న నిల్వలు: తయారైన పేస్ట్: 4,032 కేజీలు (4 టన్నులు). ముడి పదార్థాలు: 6,200 కేజీలకు పైగా నాసిరకం అల్లం, వెల్లుల్లి తొక్కలు. ...
​సొంత ప్రభుత్వంపై విజయశాంతి అసహనం: “ఉద్యమకారులకు ఇచ్చిన హామీల సంగతేంది?”
Hyderabad

​సొంత ప్రభుత్వంపై విజయశాంతి అసహనం: “ఉద్యమకారులకు ఇచ్చిన హామీల సంగతేంది?”

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన ప్రధాన వాగ్దానాలు అమలు కాకపోవడాన్ని ఆమె శాసన మండలి వేదికగా నిలదీశారు. ​అమలుకు నోచుకోని ప్రధాన హామీలు ​ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ విజయశాంతి పలు అంశాలను ప్రస్తావించారు.ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇళ్ల స్థలం మరియు ఇల్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం,నెలకు రూ. 4,000 పెన్షన్ పంపిణీ,​ఆరోగ్యం & ఉపాధి: రూ. 10 లక్షల ఆరోగ్య బీమాతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం తదితర హామీలను ప్రస్తావించారు.​"ప్రభుత్వం అనేక కొత్త పథకాలను ప్రవేశపెడుతోంది, అది శుభపరిణామమే. కానీ, రాష్ట్రం ...
Suspension | బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల సస్పెన్షన్! రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమాలపై హౌస్ కమిటీకి పట్టు.. సభలో హైడ్రామా!
Hyderabad

Suspension | బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల సస్పెన్షన్! రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమాలపై హౌస్ కమిటీకి పట్టు.. సభలో హైడ్రామా!

Telangana Legislative Council Members Suspension | హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలి వేదికగా సోమవారం సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా శాసనమండలి నుంచి ప్రతిపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్‌పై హౌస్ కమిటీ వేయాలని, మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనకు దిగడంతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటిసారిగా సస్పెన్షన్.. చరిత్రలో నిలిచిపోయేలా! కాగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఇలా మండలి సభ్యులపై సస్పెన్షన్‌ ‌వేటు పడటం ఇదే తొలిసారి. సభ్యుల సస్పెన్షన్‌కు నిరసగా బీఆర్‌ఎస్‌ ‌మండలి సభ్యులు చైర్మన్‌ ‌పోడియం వద్ద నిరసన తెలిపారు. ఈ క్రమంలో మండలి సభ్యులను మార్షల్స్ ‌బలవంతంగా లాక్కెళ్లారు. అక్రమ మైనింగ్‌ అం‌శంలో రాఘవ కన్‌‌స్ట్రక్షన్స్ ...
వైష్ణవి మిల్లులో ధాన్యం ‘మాయం’.. డీటీ సాబ్ ‘బూతుల’ పురాణం! అడిషనల్ కలెక్టర్  స్పందించాల్సిందే.. ‌‌ – Rice mill Paddy Scam
Special Stories

వైష్ణవి మిల్లులో ధాన్యం ‘మాయం’.. డీటీ సాబ్ ‘బూతుల’ పురాణం! అడిషనల్ కలెక్టర్ స్పందించాల్సిందే.. ‌‌ – Rice mill Paddy Scam

Rice mill Paddy Scam : హన్మకొండ జిల్లా పంథినిలో ఉన్న వైష్ణవి రైస్ మిల్లు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం కేటాయించిన ధాన్యానికి, మిల్లులో ఉన్న నిల్వలకు పొంతన లేదన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. అయితే, ఈ గోల్‌మాల్‌ను బయటపెట్టాల్సిన అధికారులే.. మిల్లర్ల తరపున బాకా ఊదుతుండటం విస్మయానికి గురిచేస్తోంది.​గణాంకాల ప్రకారం చూస్తే పరిస్థితి ఇలా ఉంది: ​వైష్ణవి రైస్ మిల్లు - ధాన్యం నిల్వల లెక్కల విశ్లేషణ అంశంవివరాలురైస్ మిల్లు పేరువైష్ణవి రైస్ మిల్లుప్రాంతంపంథిని, హన్మకొండ జిల్లాప్రభుత్వం కేటాయించిన ధాన్యం584.320 మెట్రిక్ టన్నులుఅప్పగించాల్సిన మొత్తం బియ్యం (CMR)393.310 మెట్రిక్ టన్నులు (సుమారు 14 ఏసీకేలు)ఇప్పటివరకు ప్రభుత్వానికి చేరిన బియ్యం1 ఏసీకే (ACK) మాత్రమేమిల్లులో ఉండాల్సిన పెండింగ్ నిల్వ13 ఏసీకేల బియ్యం (భారీ వ్యత్యాసం)ఆరోపణలు ఎదుర్కొంటున...
‘గోల్డ్ మ్యాన్’ కాదు.. అంతా ‘రోల్డ్ గోల్డ్’: పాతబస్తీ సూర్యాభాయ్ బండారం బట్టబయలు!
Hyderabad

‘గోల్డ్ మ్యాన్’ కాదు.. అంతా ‘రోల్డ్ గోల్డ్’: పాతబస్తీ సూర్యాభాయ్ బండారం బట్టబయలు!

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన 'గోల్డ్ మ్యాన్ (Gold Man) ' సూర్యాభాయ్ అలియాస్ పల్లపు సురేశ్ కుమార్ అసలు రంగు బయటపడింది. ఒళ్లంతా కిలోల కొద్దీ బంగారంతో మెరిసిపోయే ఆయన.. నిజానికి ధరించింది కేవలం నకిలీ ఆభరణాలేనని ఆదాయపు పన్ను (IT) శాఖ అధికారులు తేల్చారు. కొండా విజయ్ కుమార్ అనే వ్యక్తిపై జరుగుతున్న ఐటీ విచారణలో భాగంగా సూర్యాభాయ్ భాగోతం వెలుగులోకి వచ్చింది. ​ఐటీ విచారణలో తేలిన షాకింగ్ నిజాలు ​ సూర్యాభాయ్ ధరించే ఆభరణాలన్నీ రాగితో తయారు చేసి, వాటిపై పూత పూసినవని అధికారులు గుర్తించారు. 32 రకాల నకిలీ ఆభరణాలను ఆయన వాడుతున్నట్లు తేలింది.  బయటికి కోట్లాది రూపాయల విలువైన బంగారంగా కనిపించే ఆ నగలు, వాస్తవానికి కేవలం రూ. 3 లక్షల విలువ మాత్రమే చేస్తాయని అధికారులు నిర్ధారించారు. కేవలం ఒక్క ఆభరణం మాత్రమే వెండిపై బంగారు పూతతో తయారైనట్లు గుర్తించారు.బయటికి ధనవంతుడిగా ఫోజులిచ్చే సూర్యాభాయ్‌ కి సొంత ఇల...
error: Content is protected !!