Raja Singh | ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామాను ఆమోదించిన బిజెపి అధిష్ఠానం
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ (MLA Raja Singh) రాజీనామాను బిజెపి హైకమాండ్ ఆమోదించింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆయన తెలంగాణ బిజెపిని బహిరంగంగా విమర్శించారు. తెలంగాణ బిజెపిలో జరుగుతున్న పరిణామాలకు నిరసనగా ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన తన రాజీనామా లేఖను బిజెపి హైకమాండ్‌కు పంపారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామాను ఒక వారం తర్వాత పార్టీ అధిష్ఠానం ఆమోదించింది. దీనిని జూలై 11, 2025న బిజెపి జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ అధికారికంగా ప్రకటించారు.
బీజేపీపీ నాయకుడు, గోషామహల్ (Goshamahal ) ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామాను పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆమోదించారు. ఈ మేరకు పార్టీ హైకమాండ్ శుక్రవారం (జూలై 11) అధికారిక లేఖను విడుదల చేసింది. కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రాజా సింగ్ ఇటీవల తన రాజీనామా లేఖను కేంద్...




