Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Asifabad | ఆసిఫాబాద్‌లో భారీ వ‌ర్షాల‌తో నీట‌మునిగిన గ్రామం
Adilabad, State

Asifabad | ఆసిఫాబాద్‌లో భారీ వ‌ర్షాల‌తో నీట‌మునిగిన గ్రామం

Kumram Bheem Asifabad : ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాణహిత నది, సమీపంలోని వాగు ఉధృతంగా ఉప్పొంగుతోంది. దీంతో చింతలమానేపల్లి మండలంలోని డిమ్డా గ్రామం గురువారం పూర్తిగా మునిగిపోవ‌డంతో మిగ‌తా ప్రాంతాల‌తో సంబంధాలు తెగిపోయాయి. వరదల కారణంగా ఇండ్లు, రోడ్లు పూర్తిగా మునిగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పటి నుంచి భయంతో నివసిస్తున్న నివాసితులు, తమను సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని, ప్రాథమిక అవ‌స‌రాలుక ల్పించి భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను వేడుకుంటున్నారు. ప్రాణహిత న‌ది (Pranihita River), పెద్దవాగు వాగుల ఒడ్డున ఉన్న అనేక ఇతర లోతట్టు ప్రాంతాలు కూడా తెగిపోయే ప్రమాదంలో ఉన్న‌ట్లు స‌మాచారం. వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిన్నందున బురదమయమైన ప్రాంతాలలో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. మండల కేంద్రాలు, సమీప పట్టణాలకు చేరుకోవడానికి ద్విచక్ర వాహనాలు, ఆటో-రిక్షాలపై ఆధారపడుతున్నారు. ...
పలు జిల్లాల్లో డెంగ్యూ విజృంభణ.. జాగ్రతలు ఇలా తీసుకోండి.. -Rainy Season Diseases
Trending

పలు జిల్లాల్లో డెంగ్యూ విజృంభణ.. జాగ్రతలు ఇలా తీసుకోండి.. -Rainy Season Diseases

Rainy Season Diseases | వర్షాకాలానికి వచ్చిందంటే చాలు ఇంట్లో ఒక్కొక్కరిగా విషజ్వరాలు అంటుకుంటాయి. జ్వరంతో మొదలై జలుబు, దగ్గు తీవ్రతరమై మంచం పడతారు. ఈ వర్షాకాలం వస్తూ వస్తూ తనతో పాటు ఎన్నో రకాల వ్యాధులను వెంటతీసుకొని వస్తుంటుంది. ముఖ్యంగా మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికెన్ గున్యూ వంటి జ్వరాలు వ్యాపిస్తుంటాయి. ఇది సాధారణంగా 8-10 రోజుల పాటు వేధిస్తుంటుంది. ఇందులో డెంగీతో ప్రాణాపాయం కూడా కలగవచ్చు. ఇది ఏడిస్‌ దోమలు కుట్టడం వల్ల వ్యాపిస్తుంది. అయితే చాలా వరకు డెంగ్యూ లక్షణాలు సాధారణ జ్వరాన్ని పోలి ఉండడంతో మొదట్లో గుర్తించడం కష్టంగా ఉంటుంది. అయితే నిర్లక్ష్యం చేస్తే కొన్ని సందర్భాల్లో అది ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. Scarlet Fever Rainy Season Diseases : తెలంగాణ వ్యాప్తంగా విష జ్వరాలు వర్షాకాలం మొదలవడంతోనే హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వైరల్ జ్వరాలు, ముఖ్యంగా డెంగ్యూ, ...
Bridge Collapse | 10 మంది మృతికి కారణమైన బ్రిడ్జి ఎలా కూలిపోయింది.. ?
National

Bridge Collapse | 10 మంది మృతికి కారణమైన బ్రిడ్జి ఎలా కూలిపోయింది.. ?

Bridge Collapse : గుజరాత్​ లోని ఆనంద్ – వడోదర జిల్లాలను కలిపే గంభీర వంతెనలోని ఒక భాగం పద్రా తాలూకాలోని ముజ్‌పూర్ గ్రామం సమీపంలో కూలిపోవడంతో రెండు ట్రక్కులు, ఒక బొలెరో SUV, ఒక పికప్ వ్యాన్ సహా నాలుగు వాహనాలు మహిసాగర్ నదిలోకి పడిపోయాయి. ఈ ప్రమాదంలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. రెస్క్యూ ఆపరేషన్​లో తొమ్మిది మందిని రక్షించారు. సంజయ్ సింగ్ డీసీ, యు/సి ఇన్‌స్పెక్టర్ కృష్ణ కుమార్ పర్యవేక్షణలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. గంభీర వంతెన నాలుగు దశాబ్దాలకు పైగా మధ్య గుజరాత్, సౌరాష్ట్ర మధ్య కీలకమైన లింక్‌గా పనిచేసింది.ఈ ఆకస్మిక కూలిపోవడం వల్ల ఆనంద్, వడోదర, భరూచ్, అంకలేశ్వర్ మధ్య రవాణా సంబంధాలు తెగిపోయాయి. ఈ కారిడార్ రోజువారీ ప్రయాణికులు, వస్తువుల రవాణా, మధ్య గుజరాత్ – సౌరాష్ట్ర మధ్య అంతర్-జిల్లా కనెక్టివిటీకి కీలకమైనది. ప్రతిరోజూ ప్రయాణీకులు, కార్గో వాహనాలతో ఈ వంతెన నిత్యం రద్దీగా ఉ...
Bharat Bandh : నేడు భారత్ బంద్.. సమ్మెలో 25 కోట్ల మంది కార్మికులు?
National

Bharat Bandh : నేడు భారత్ బంద్.. సమ్మెలో 25 కోట్ల మంది కార్మికులు?

బ్యాంకింగ్, బీమా, బొగ్గు గనులు, తపాలా, నిర్మాణ రంగాల్లో సేవలకు అంతరాయం Bharat Bandh LIVE updates : దేశవ్యాప్తంగా బుధవారం (జూలై 9) 'భారత్ బంద్'కు పిలుపునిచ్చాయి. దీనికి దాదాపు 10 కేంద్ర కార్మిక సంఘాల కూటమి, అనేక రైతు సంఘాలు మ‌ద్ద‌తు ఇచ్చాయి. కేంద్రం అనుస‌రిస్తున్న "కార్పొరేట్ అనుకూల" విధానాలను నిరసిస్తూ ప‌లు సంఘాలు ఈ సమ్మెను నిర్వహిస్తున్నాయి. బ్యాంకింగ్, బీమా, బొగ్గు గనులు, తపాలా, నిర్మాణ రంగాల వంటి పబ్లిక్ సర్వీస్ విభాగాలకు చెందిన 25 కోట్ల మందికి పైగా కార్మికులు నేటి దేశవ్యాప్త సమ్మె (భారత్ బంద్)లో పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న "కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలు"పై నిరసనగా 10 కేంద్ర కార్మిక సంఘాలు ఈ బంద్ పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే.. ఈ సంద‌ర్భంగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కి చెందిన అమర్ జీత్ కౌర్ మాట్లాడుతూ, “25 కోట్ల మంద...
Secunderabad | ప్రయాణికులకు గుడ్​ న్యూస్​.. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు
Hyderabad, State

Secunderabad | ప్రయాణికులకు గుడ్​ న్యూస్​.. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు

Secunderabad : ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో పలు కీలక మార్గాల్లో తాత్కాలికంగా ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ మేరకు రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. Secunderabad -ఆర్సీకేరే (07079/ 07080) ప్రత్యేక రైలు ఈనెల 13 నుంచి ఆగస్టు 31 వరకు ప్రతీ ఆదివారం సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 14 నుంచి సెప్టెంబర్ 1 వరకు ప్రతి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు అర్పికేరేలో బయ లుచేరి మరుసటి రోజు ఉదయం 7.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్-అర్సికెరే (07060/07010) హైదరాబాద్-అర్సీకేరీ (07060/07010) స్పెషల్ ట్రైన్ ఈ నెల 8 నుంచి ఆగస్టు 26 వరకు ప్రతి మంగళవారం సాయంత్రం 7.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45కు చేరుకుం టుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 8వ తేదీ నుంచి ఆగస్టు 27 వరకు ప్రతి ...
error: Content is protected !!