Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరో శుభవార్త – లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.146.3 కోట్లు
State, Hyderabad

Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరో శుభవార్త – లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.146.3 కోట్లు

Hyderabad : తెలంగాణలో అమలు అవుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma Houses) కింద లబ్ధిదారులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. తాజా విడతలో 13,841 మంది లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.146.30 కోట్లు జమ చేసినట్టు అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద ప్రభుత్వం రూ.1435 కోట్ల నిధులను విడుదల చేసినట్లు గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఇళ్ల నిర్మాణ పురోగతి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2.15 లక్షల ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో 1.29 లక్షల ఇళ్లు నిర్మాణంలో కొనసాగుతున్నాయి. సుమారు 20 వేల ఇళ్లు గోడల దశలో , 8,633 ఇళ్లు పైకప్పు దశలో ఉన్నాయని వెల్లడించారు. అలాగే, ఇప్పటికే పూర్తి అయిన ఇళ్లలో పలువురు లబ్ధిదారులు గృహప్రవేశం కూడా చేసినట్టు తెలిపారు. ప్రతి సోమవారం నగదు జమ విధానం ప్రతి సోమవారం, ఇళ్ల నిర్మాణ (Indiramma Houses ) పురోగతిని బట్టి లబ్ధిదారుల బ్యాంక్ ...
TTD : తిరుమలలో యాచకులు, అనధికార వ్యాపారులపై ప్రత్యేక డ్రైవ్
State, AndhraPradesh

TTD : తిరుమలలో యాచకులు, అనధికార వ్యాపారులపై ప్రత్యేక డ్రైవ్

త్వ‌ర‌లో బ్రహ్మోత్సవాల నేప‌థ్యంలో ముందస్తు భద్రతా చర్యలు తిరుమల: సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 02 వరకు తిరుమలలో జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను (Tirumala Brahmotsavam 2025) దృష్టిలో ఉంచుకుని, టిటిడి (TTD) చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు, ఆరోగ్య విభాగం సిబ్బంది, తిరుమల పోలీసులతో కలిసి తిరుమలలో అనధికార వ్యక్తులు, యాచకులను ఇక్క‌డి నుంచి పంపించేందుకు (Beggars Eviction) ఆదివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. కల్యాణకట్ట, SV షాపింగ్ కాంప్లెక్స్ సమీపంలోని షెడ్లలో చాలా కాలంగా ఉంటున్న యాచకులు, అక్రమ వ్యాపారులను తిరుమల నుంచి బహిష్కరించారు. పోలీసులు, TTD విజిలెన్స్, హెల్త్ & శానిటేషన్ అధికారులు ఎటువంటి పర్మిట్లు లేకుండా వ్యాపారం చేస్తున్న 82 మంది అనధికార వ్యాపారులను, ఇక్కడ చాలా...
గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్స్‌లో టీవీలు, స్మార్ట్ ఫోన్ లపై 40% వరకు తగ్గింపు – Amazon Great Indian Festival 2025
Business

గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్స్‌లో టీవీలు, స్మార్ట్ ఫోన్ లపై 40% వరకు తగ్గింపు – Amazon Great Indian Festival 2025

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 (Amazon Great Indian Festival 2025) తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఇది సెప్టెంబర్ 23 నుంచి ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో ప్రారంభమవుతుంది. ఈ ద‌స‌రా, దీపావ‌ళి పండుగల‌కు ముందుగానే, కంపెనీ సెప్టెంబర్ 13 నుండి కొత్త సేల్స్ లోని ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. అమెజాన్ ఫెస్టివల్ సేల్ కోసం ఈ ప్రారంభ డీల్స్ స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలతో సహా ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకు భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ సంవత్సరం, అమెజాన్ తన వినియోగదారులకు AI- ఆధారిత షాపింగ్ అనుభవాన్ని కూడా ప్రవేశపెడుతుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు అన్ని డీల్స్‌కు 24 గంటల ముందుగానే యాక్సెస్ పొందుతారు. ప్రైమ్ సభ్యులకు ప్రత్యేకమైన డిస్కౌంట్లతో కూడిన ప్రత్యేక "ప్రైమ్ ధమాకా" ఆఫర్ కూడా లభిస్తుంది. ఈ సంవత్సరం ఫెస్టివల్ సేల్ సందర్భంగా 1,00,000 కంటే ఎక్కువ ఉత్పత్తులు తమ అత్యల్ప ధరలకు లభిస్తాయని కంపెన...
సిరిసిల్లకు చేరుకున్న రైల్వే లైన్ – విజయవంతమైన ట్రయల్ రన్ – Sircilla Vemulawada Railway Lline
State, Karimnagar

సిరిసిల్లకు చేరుకున్న రైల్వే లైన్ – విజయవంతమైన ట్రయల్ రన్ – Sircilla Vemulawada Railway Lline

Sircilla Vemulawada Railway Lline : ఎన్నో ద‌శాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైల్వే లైన్ ఎట్టకేలకు సిరిసిల్ల జిల్లా (Rajanna sircilla district )కు చేరుకుంది. కొన్ని రోజుల క్రితం రైల్వే అధికారులు సిద్దిపేట (Siddipet) శివార్లలోని నర్సాపూర్ రైల్వే స్టేషన్ నుంచి పెద్దకోడూరు, చిన్నకోడూరు, మాచాపూర్ గ్రామాల మీదుగా మందపల్లి వరకు విజయవంతమైన ట్రయల్ రన్ నిర్వహించారు. మనోహరాబాద్-కొత్తపల్లి (Manoharabad Kothapalli Line ) రైల్వే ప్రాజెక్ట్ 162 కి.మీ.ల విస్తీర్ణంలో ఉంది. ఈ రైల్వేలైన్‌కు ₹1,162 కోట్లు ఖర్చవుతుందని రైల్వే శాఖ అంచ‌నా వేసింది. ఇందు కోసం ₹350 కోట్లు కేటాయించింది. వీటిలో గత బడ్జెట్ నుంచి ₹165 కోట్లు ఉన్నాయి. మనోహరాబాద్-సిద్దిపేట విభాగం ఇప్పటికే పూర్తయింది. ఇప్పుడు సిద్దిపేట-సిరిసిల్ల‌ మార్గంలో ట్రయల్ రన్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ లైన్ త్వరలో తంగెళ్లపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామానికి చేరుకుంటుందని రైల...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతే స్థానిక సంస్థల పోలింగ్‌? – Jubilee Hills Byelection
State, Hyderabad

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతే స్థానిక సంస్థల పోలింగ్‌? – Jubilee Hills Byelection

హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక (Jubilee Hills Byelection) పూర్తయ్యాకే రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Polls) జరిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదట్లో ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, స్థానిక సంస్థల ఎన్నికలు నవంబర్‌లో నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే 42% బీసీ రిజర్వేషన్ల అంశం ఇంకా పెండింగ్‌లో ఉండడంతో ఎన్నికల ప్రక్రియ వాయిదా పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ బిల్లులు గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం కోసం వేచి ఉన్నాయి. జూన్‌లో హైకోర్టు సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించినప్పటికీ, కేవలం రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రభుత్వం మరింత గడువు కోరే ప్రయత్నంలో ఉంది. కాంగ్రెస్ నేతలు కూడా ఇదే విషయాన్ని బహిరం...
error: Content is protected !!