జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. Parliament Session-2025
Parliament Monsoon Session-2025 | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 21, 2025 వరకు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 15న జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సన్నాహాలు, భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆగస్టు 13, 14 తేదీల్లో సమావేశాలు ఉండవని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది.
ఈ సెషన్‌ను లోక్‌సభ. రాజ్యసభ రెండింటినీ ఏర్పాటు చేయడానికి భారత రాష్ట్రపతి ఆమోదం తెలిపారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. "జూలై 21 నుండి ఆగస్టు 21, 2025 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను భారత రాష్ట్రపతి ఆమోదించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల దృష్ట్యా, ఆగస్టు 13, 14 తేదీలలో సమావేశాలు ఉండవు" అని ఆయన Xలో పోస్ట్ చేశారు.
ఆపరేషన్ సిందూర్‌పై వాడీవేడిగా చర్చలకు అవకాశం
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జర...




