Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
SIR : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ?
National

SIR : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ?

New Delhi : ఓటర్ల జాబితా సవరణ (SIR) గురించి బ్రేకింగ్ న్యూస్ వ‌స్తున్నాయి.. కేంద్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 10న దిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సమావేశంలో, బీహార్ తర్వాత దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో SIR నిర్వహించడం గురించి చర్చ ఉంటుంది. ఎన్నికల సంఘం ఇప్పటికే అధికారికంగా దీని గురించి తన ఉద్దేశాన్ని ప్ర‌క‌టించింది. బీహార్‌లో జరుగుతున్న SIR (Special Intensive Revision) గురించి సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో కూడా కమిషన్ దీని గురించి సమాచారం ఇచ్చింది. సెప్టెంబర్ 10న దిల్లీలో కీల‌క‌ సమావేశం టైమ్స్ నౌ నవభారత్ కు అందిన సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య ఎన్నికల అధికారుల సమావేశం సెప్టెంబర్ 10న ఢిల్లీలోని ద్వారకలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌లో జరుగుతుంది. ...
Dharmavaram : నడిరోడ్డుపై రౌడీ షీటర్‌ దారుణ హత్య
Crime, AndhraPradesh

Dharmavaram : నడిరోడ్డుపై రౌడీ షీటర్‌ దారుణ హత్య

Dharmavaram murder news : శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో పట్టపగలే జ‌రిగిన‌ దారుణ హత్య సంఘ‌ట‌న అంద‌రినీ భ‌యాందోళ‌న‌కు గురిచేసింది. బైక్‌పై వెళ్తున్న ఓ రౌడీషీటర్‌ను కొందరు వ్యక్తులు కారుతో ఢీ కొట్టి వేట కొడవళ్లతో దారుణంగా నరికి చంపేశారు. ఈ ఘ‌ట‌న జిల్లాలో క‌ల‌క‌లం రేపింది. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.. ధర్మవరం (Dharmavaram) కొత్తపేట గ్రామానికి చెందిన తలారి లోకేంద్ర (26) గురువారం త‌న‌ స్నేహితుడితో కలిసి ద్విచ‌క్ర‌వాహ‌నంపై బ‌య‌లుదేరాడు. ఈ క్ర‌మంలో శ్రీనిధి మార్ట్‌ వద్ద బైక్ ఆగాడు. ఇంతలోనే వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు అతడి బైక్‌ను ఢీకొట్టింది. కిందపడిపోయిన లోకేంద్రపై కారులో నుంచి దిగిన ఇద్దరు వ్యక్తులు వేట కొడవళ్లతో ఒక్క‌సారిగా మీద‌ప‌డిపోయారు. ముఖం, మెడపై అతి కిరాతకంగా నరికారు. వెంట‌నే అదే అదే కారులో అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు. అయితే ఈ దృశ్యాల‌న్నీసీసీ కెమెరాలో రికార్డయింది. హత్య జరిగిన స్థలాన్ని ...
ACB trap | ఏసీబీ వ‌ల‌లో జిల్లా మ‌త్స్య‌శాఖ అధికారిణి
Crime, Nalgonda

ACB trap | ఏసీబీ వ‌ల‌లో జిల్లా మ‌త్స్య‌శాఖ అధికారిణి

Nalgonda : న‌ల్ల‌గొండ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో జిల్లా మ‌త్స్య శాఖ అధికారిణి లంచం తీసుకుంటూ ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డారు (ACB trap) . ఫిష‌రీస్ కో ఆప‌రేటివ్ సొసైటీలో కొత్త స‌భ్యుల పేర్ల న‌మోదుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరగా, అందుకు మ‌త్స్య‌శాఖ అధికారిణి చ‌రిత రెడ్డి లంచం డిమాండ్ చేశారు. గురువారం బాధితుడి నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండ‌గా ఆమెను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం ఆమెను కోర్టులో హాజ‌రు ప‌రిచి రిమాండ్‌కు త‌ర‌లించారు. లంచం అడిగితే ACB కి ఇలా ఫిర్యాదు చేయండి.. వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.go...
యూరియా కోసం క్యూలో నిలబడి కుప్పకూలిపోయిన మహిళా రైతు- Urea shortage in Telangana
State, Mahaboobnagar

యూరియా కోసం క్యూలో నిలబడి కుప్పకూలిపోయిన మహిళా రైతు- Urea shortage in Telangana

Narayanapet : జిల్లాలోని తిలేరులోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) వద్ద గురువారం యూరియా కోసం క్యూలో నిలబడి ఒక మహిళా రైతు కుప్పకూలిపోయింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్య‌లో మహిళలు సహా చాలా మంది రైతులు PACS వద్దకు తరలివచ్చారు. పీఏసీఎస్ వ‌ద్ద యూరియా (Urea shortage) కోసం క్యూలలో నిలబడాల్సి వచ్చింది. చాలా మందిలాగే, మణెమ్మ కూడా PACS వద్దకు చేరుకుని వరుసలో నిలబడి వంతు కోసం వేచి ఉంది. ఈ క్ర‌మంలో ఆమె తల తిరుగుతున్నట్లు అనిపించి కుప్పకూలిపోయింది, వెంటనే రైతులు, PACS అధికారులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా మణెమ్మ ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందడానికి ఏమీ లేదని అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. టోకెన్‌తో పాటు, రైతుల వేలికి సిరా ఇదిలా ఉండ‌గా PACS వద్ద యూరియా (Urea ) కోసం క్యూలో ఉన్న‌వారు మ‌రోసారి రాకుండా చూసుకోవడానికి అధికారులు వారి బొటనవేళ్లపై చెరగని స...
GST tax rates 2025 : ఈ వస్తువుల ధరలు భారీగా తగ్గుతున్నాయి.. లిస్ట్ చెక్ చేసుకోండి…
Business

GST tax rates 2025 : ఈ వస్తువుల ధరలు భారీగా తగ్గుతున్నాయి.. లిస్ట్ చెక్ చేసుకోండి…

GST tax rates 2025 : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జీఎస్టీ కౌన్సిల్ (GST Council ) సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంది ముఖ్యంగా సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. కొత్త జీఎస్టీ అమలు వచ్చినట్లయితే కేవలం 5 శాతం, 18 శాతం రెండు స్లాబులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీంతో పలు వస్తువుల ధరలు భారీగా తగ్గిపోయాయి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాలు (అధిక ఉష్ణోగ్రత), చెన్నా, పన్నీర్ పిజ్జా బ్రెడ్, ఖఖ్రా, సాదా చపాతీ లేదా రోటీ, పరాఠాలు వెన్న, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, కండెన్స్డ్ మిల్క్, జున్ను, అంజీర్, ఖర్జూరం అవకాడోలు, సిట్రస్ పండ్లు, సాసేజ్‌లు, మాంసం, చక్కెరతో తయారు చేసిన మిఠాయిలు, జామ్‌లు, పండ్ల జెల్లీలు, 20 లీటర్ల సీసాలో ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్లు, ఉప్పు, తాగే నీరు పండ్ల గుజ్జు లేదా రసం, పాలు, ఐస్ క్రీం, పేస్ట్రీలు, బిస్కెట్లు మొక...
error: Content is protected !!