Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Oil Palm | ములుగులో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ..!
State, warangal

Oil Palm | ములుగులో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ..!

Oil Palm Factory in Mulugu | ములుగు జిల్లా ఇంచర్లలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం 12 ఎకరాలు కేటాయిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిపై పంచాయతారాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ‌ మంత్రి డాక్టర్ సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో ములుగు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగుతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని మంత్రి ఆశాభావం వ్య‌క్తం చేశారు.వెనకబడిన జిల్లా ములుగు పారిశ్రామికీకరణకు క్యాబినెట్ నిర్ణయంతో ముందడుగు పడిందని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు కేబినెట్‌ మంత్రులకు మంత్రి సీతక్క జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఆమె చెప్పిన విధంగా, ఈ నిర్ణయం ములుగు జిల్లాకు అభివృద్ధి దిశగా పెద్ద బలాన్నిస్తుంది. ములుగు జిల్లాలో ఆయిల్ పామ్ (Oil Palm) పరిశ్రమ ఏర్పాటుతో జిల్లాకు కొత్త ఊపు రానుంది. జిల్లాలో ...
Maoist Sudhakar | మావోయిస్టు అగ్రనేత  ఎన్‌కౌంట‌ర్
Crime

Maoist Sudhakar | మావోయిస్టు అగ్రనేత ఎన్‌కౌంట‌ర్

Maoist Sudhakar | మావోయిస్టు పార్టీకి వ‌రుస‌గా ఎదురుదెబ్బ‌లు త‌గులుతూనే ఉన్నాయి. మావోయిస్టు పార్టీ అగ్ర‌నేత నంబాల కేశ‌వ‌రావు ఎన్‌కౌంట‌ర్ ఘ‌ట‌న జ‌రిగిన కొన్ని రోజుల‌కే మ‌రో అగ్ర నేత‌ను పోలీసులు ఎక్‌కౌంట‌ర్ చేశారు. చ‌త్తీస్‌గ‌ఢ్‌ (Chhattisgarh)లోని బీజాపూర్ (Bijapur) నేష‌న‌ల్ పార్కు వ‌ద్ద జ‌రిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్ర‌నేత‌, కేంద్ర క‌మిటీ స‌భ్యుడు సుధాక‌ర్ (Maoist Sudhakar) (65) మృతి చెందిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. కాగా సుధాక‌ర్ స్వ‌స్థ‌లం ఏలూరు (Elur) జిల్లా చింత‌ల‌పూడి మండ‌లం ప్ర‌గ‌డ‌వ‌రం గ్రామం. 40 సంవ‌త్స‌రాలుగా మావోయిస్టు ఉద్య‌మంలో సుధాక‌ర్‌ ఉన్నారు. 2004లో నాటి ఏపీ ప్ర‌భుత్వంతో శాంతి చ‌ర్చ‌ల్లో ఆయ‌న‌ పాల్గొన్నారు. సింహాచ‌లం అలియాస్ సుధాక‌ర్‌పై రూ. 50 ల‌క్ష‌ల రివార్డు ఉంది. సుధాక‌ర్ పూర్తి పేరు తెంటు ల‌క్ష్మీన‌ర‌సింహాచ‌లం. గత నెల చివర్లో, బీజాపూర్ జిల్లాలో 24 మంది మావోయ...
Corona Virus | భారత్‌లో కరోనా మళ్లీ కలవరం 24 గంటల్లో 564 కొత్త కేసులు
National

Corona Virus | భారత్‌లో కరోనా మళ్లీ కలవరం 24 గంటల్లో 564 కొత్త కేసులు

Corona Virus | భారత్ లో మరోసారి కరోనా వైరస్‌ (COVID-19) ప్రభావం కనిపిస్తోంది. ఇటీవల రోజువారీ కేసుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది. గత 24 గంటల్లో 564 పాజిటివ్‌ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. 2025లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,866కి చేరింది. రాష్ట్రాల వారీగా కేసుల వివరాలు: కేరళ – 1,487 కేసులు ఢిల్లీ – 562 కేసులు పశ్చిమ బెంగాల్ – 538 కేసులు మహారాష్ట్ర – 526 కేసులు గుజరాత్ – 508 కేసులు కర్ణాటక – 436 కేసులు తమిళనాడు – 213 కేసులు Corona Virus : పెరుగుతున్న మరణాలు.. గత 24 గంటల్లో 7 మంది కరోనా వల్ల మృతి చెందారు. ఇందులో ఢిల్లీలో ఒక చిన్నారి సహా ఇద్దరు, కర్ణాటకలో ఇద్దరు, మహారాష్ట్రలో ముగ్గురు మరణించారు. దీంతో 2025లో ఇప్పటి వరకు మొత్తం మృతుల సంఖ్య 51కి పెరిగింది. కాగా, ఇప్పటివరకు 3,955 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రజల...
Anganwadi | త్వరలో 14,000 అంగన్వాడీ పోస్టుల భర్తీ | మంత్రి సీతక్క కీలక ప్రకటన
Hyderabad, State

Anganwadi | త్వరలో 14,000 అంగన్వాడీ పోస్టుల భర్తీ | మంత్రి సీతక్క కీలక ప్రకటన

వారానికి రెండు సార్లు ఎగ్ బిర్యానీ దివ్యాంగుల ఉపకరణాల కోసం ఏటా రూ.50 కోట్లు మ‌హిళా శిశు సంక్షేమ‌శాఖ మంత్రి సీత‌క్క‌ Hyderabad : అంగన్వాడీ (Anganwadi) టీచర్లు, హెల్పర్ల పని ఒత్తిడిని తగ్గించేందుకు త్వరలో 14 వేల ఖాళీలను భర్తీ చేస్తామని మ‌హిళా శిశు సంక్షేమ‌శాఖ మంత్రి ద‌న‌స‌రి సీత‌క్క (Minister Seethakka) తెలిపారు. రాజేంద్రనగర్ లోని తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మేధో మథ‌న సదస్సు 2025 జ‌రిగింది. ఇందులో భాగంగా అంగన్వాడీ చిన్నారుల అభ్యాసం కోసం వినూత్నంగా రూపొందించిన టీచింగ్ మెటీరియల్ స్టాళ్లను మంత్రి సీతక్క పరిశీలించి అభినందించారు. అంగన్వాడీ చిన్నారులకు పంపిణీ చేసే స్నాక్స్, బాలమృతం రుచి చూశారు. బాలామృతాన్ని ప్యాకెట్లలో కాకుండా బాక్సుల్లో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఆదిలాబాద్ మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ ను సందర్శించి ఆదివాసీల ఆహార...
పౌర సరఫరాల శాఖలో.. కాసుల “రాణి”  – Civil Supplies Department
Special Stories

పౌర సరఫరాల శాఖలో.. కాసుల “రాణి” – Civil Supplies Department

ఏ ఫైలు కదలాలన్నా.. మేడం చేయి తడపాల్సిందేనట..? Corruption in Civil Supplies Department | రాజుల కాలంలో రాజ్యానికి రాణులు ఉండేవారు. కానీ ప్రస్తుతం ఆ కార్యాలయానికి కూడా ఓ రాణి ఉందంటే అతిశయోక్తి కాదట. రాణి అంటే మహారాణి కాదు "కాసుల రాణి". ఓ మహిళా అధికారి ఆ కార్యాలయాన్నే తన సామ్రాజ్యంగా ఫీల్ అవుతూ తనకు తాను ఆ కార్యాలయానికే "రాణి "లా ఊహించుకుంటూ తన అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె రాచరిక పోకడలు, మిల్లర్ పట్ల ఆమె ప్రదర్శిస్తున్న తీరు చూస్తుంటే రాజుల కాలం గుర్తొస్తుందని కొంతమంది మిల్లర్ బహిరంగంగానే ఆ అధికారిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.హన్మకొండ పౌరసరఫరాల శాఖలో ఏ ఫైలు కదలాలన్న,ఆ ఫైలు మీద ఆమె సంతకం చేయాలన్న మేడం ను కలవాల్సిందేనట,కలుసుడంటే అలా ఇలా కలుసుడు కాదు కాసులతో కలిస్తేనే వాళ్ళ ఫైళ్లు కదులుతున్నాయని విశ్వసనీయంగా తెలిసింది. Civil Supplies | ఫైలు కదలాలంటే.. ముడుపులు ...
error: Content is protected !!