Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Viral Video | సెల్ఫీ తీస్తాన‌ని చెప్పి భర్తను నదిలోకి తోసిన భార్య ? వీడియో వైరల్.. చూడండి
Viral

Viral Video | సెల్ఫీ తీస్తాన‌ని చెప్పి భర్తను నదిలోకి తోసిన భార్య ? వీడియో వైరల్.. చూడండి

Mahaboob Nagar Viral Video | : సెల్ఫీ తీసుకునే నెపంతో ఓ భార్య‌ తన భర్తను కృష్ణా నదిలోకి తోసేసిన ఘటన శనివారం క‌ల‌క‌లం రేపింది. వివ‌రాల్లోకి వెళితే.. కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని కడ్లూర్ గ్రామంలోని కృష్ణా నదిపై ఉన్న వంతెన దగ్గరకు తాతప్ప, అతడి భార్య వ‌చ్చారు. ఈ వంతెన తెలంగాణలోని నారాయణపేట జిల్లాతో సరిహద్దులో ఉంటుంది. వంతెన వద్దకు చేరుకున్న తర్వాత, తాతప్ప, అతని భార్య మొబైల్‌లో కొన్ని ఫోటోలు తీశారు. సెల్ఫీ తీసుకోవాలనుకున్నప్పుడు, భర్త ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో పడిపోయాడు . తాతప్ప ఈదుకుంటూ నదిలో ఉన్న ఒక బండరాయిని పట్టుకోగలిగాడు. అతని అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని తాడుతో అతన్ని రక్షించారు. ఊపిరి పీల్చుకున్న తర్వాత, తాతప్ప తన భార్య తనను ఉద్దేశపూర్వకంగా నదిలోకి తోసిందని ఆరోపించాడు. ఆ జంట అక్కడికక్కడే గొడవ పడుతుండగా, స్థానికులు వారిని శాంతింపజేసి వారి తల్లిదండ్రులకు ఫోన్ చే...
Bhadradri Kothagudem : పోలీసుల ఎదుట మావోయిస్టుల లొంగుబాటు
Khammmam, State

Bhadradri Kothagudem : పోలీసుల ఎదుట మావోయిస్టుల లొంగుబాటు

Bhadradri Kothagudem : నక్సలిజం హింసాత్మక మార్గాన్ని విడిచిపెట్టి, వారి కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకొని ఆరుగురు మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ముందు శనివారం లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం పోలీసు సూపరింటెండెంట్ బి.రోహిత్ రాజు మాట్లాడుతూ, పోలీసు శాఖ "ఆపరేషన్ చేయూత" కార్యక్రమం కింద గిరిజనుల కోసం తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాల గురించి తెలుసుకున్న తర్వాత మావోయిస్టులు ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులలో ఒక డివిజనల్ కమిటీ సభ్యుడు, కంపెనీ/ప్లాటూన్ కమిటీ (DVCM/CYPC), ఇద్దరు ప్లాటూన్ పార్టీ కమిటీ సభ్యులు (PPCM), ఏరియా కమిటీ సభ్యులు (ACM), ముగ్గురు పార్టీ సభ్యులు (PMలు) స్వచ్ఛందంగా నక్సలిజం హింసాత్మక మార్గాన్ని విడిచిపెట్టి, వారి కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాదిలో 300 మంది ...
Baby Girl Sold | ఐదో సంతానంగా ఆడపిల్ల పుట్టిందని అమ్మేసిన తల్లిదండ్రులు
Nizamabad, State

Baby Girl Sold | ఐదో సంతానంగా ఆడపిల్ల పుట్టిందని అమ్మేసిన తల్లిదండ్రులు

రూ.2 లక్షలకు సోలాపూర్‌ వ్యక్తికి విక్రయం Baby Girl Sold : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఆడ శిశువును విక్రయించిన ఘటన కలకలం రేపింది. ఐదో సంతానంగా ఆడ శిశువు పుట్టిందని, తాము పోషించలేమని స్వ‌యంగా తల్లిదండ్రులే విక్ర‌యించారు. రెండు లక్షల రూపాయలకు మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన వ్యక్తిలో బేరం కుదుర్చుకొని అమ్మినట్టు స‌మాచారం. ముత్యాలమ్మ, వెంకట్రావు అనే దంపతులకు ఇప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు. ఐదో సంతానంగా పుట్టిన ఆడ శిశువును అమినట్లు స్థానికులకు అనుమానం రావ‌డంతో వెంట‌నే వారు చైల్డ్‌లైన్‌కి ఫిర్యాదు చేశారు. దాంతో అధికార యంత్రాంగం వెంట‌నే రంగంలోకి దిగి కేసు నమోదు చేసి విచారణ మొద‌లు పెట్టింది. కాగా శిశు విక్ర‌యంపై మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేసిన‌ట్లు నిజామాబాద్‌ పోలీసులు వెల్ల‌డించారు. అమ్ముడైన శిశువును అధికారులు తిరిగి చేర‌దీసి బాలల‌ సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఆడపిల్లలను పోషించలేమ...
 ఢిల్లీలో పెను ప్రమాదం.. కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం – Delhi Building Collapse
Crime, National

 ఢిల్లీలో పెను ప్రమాదం.. కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం – Delhi Building Collapse

Delhi Building Collapse : న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలోని వెల్‌కమ్ ప్రాంతంలో శనివారం ఉదయం నాలుగు అంతస్తుల భవనం కుప్ప‌కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో శిథిలాల కింద ప‌లువురు చిక్కుకున్నారని పోలీసులు తెలిపారు. శిథిలాల నుంచి ముగ్గురిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప‌లు సంస్థలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని పోలీసులు తెలిపారు. "శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుపోవచ్చు" అని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. "ఉదయం 7 గంటలకు భవనం కూలిపోయినట్లు మాకు కాల్ వచ్చింది. ఏడు అగ్నిమాపక దళాలు సహా స‌హాయ‌క బృందాలు పనిచేస్తున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది" అని అధికారి తెలిపారు. స్థానికులు ఉదయం నడకకు వెళ్లినప్పుడు భవనం కూలిపోయింది. వీరిలో చాలామంది అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపు చిక్కుకున్న వారిని రక్షించడానికి ప్రయత్నించారు. తరువాత అగ్నిమాపక శాఖ సహాయంతో, ముగ్గురిని రక్షించారు. సీలంప...
MGM Hospital | ఎంజీఎం ఆస్పత్రిలో మారిన మృతదేహాలు..
Trending, Viral

MGM Hospital | ఎంజీఎం ఆస్పత్రిలో మారిన మృతదేహాలు..

అంత్యక్రియల సమయంలో బయటపడ్డ నిజం Warangal MGM Hospital | రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలై ఓ వ్యక్తి ఎంజీఎం ఆస్పత్రిలో (MGM Hospital ) చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బంధువులు, స్నేహితులు అంతా సదరు వ్యక్తి మృతదేహం చుట్టూ చేరి కన్నీరుమున్నీరయ్యారు. ఈక్రమంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని శ్మశానానికి తరలించి దహన సంస్కారాలు చేయడానికి సిద్ధమయ్యారు. ఇక చివరిసారిగా మృతుని ముఖం చూడాలన బంధువులు భావించారు. శవానికి చుట్టిన వస్త్రాన్ని తొలగించి చూడగా అందరూ అవాక్కయ్యారు. ఆ శవం తమ వ్యక్తికి కాదని గుర్తించడంతో అక్కడ కలకలం రేపింది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన కుమారస్వామి అనే వ్యక్తి తొర్రూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో అతడిని ఎంజీఎంకు తరలించి చికిత్స అందించారు. మూడు రోజుల పాటు చికిత్స ప...
error: Content is protected !!