Education Scam | అనుమతులు లేకుండా బ్రాంచీలు నిర్వహిస్తున్న ‘రెజోనెన్స్’ కళాశాలలు
రంగురంగుల బ్రోచర్ల మాయలో పడిపోతున్న తల్లిదండ్రులు
జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఏం చేస్తోంది?
Education Scam in Hanmakonda | ఆకర్షణీయమైన యాడ్ లు, నగరంలో పెద్ద పెద్ద హోర్డింగ్ లు, తల్లిదండ్రులను బురిడీ కొట్టించే బ్రోచర్ లు, మాయమాటలతో కనికట్టు చేసే పిఆర్వోలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కార్పొరేట్ కాలేజీగా ప్రచారం చేసుకోవడంలో రెజోనెన్సు కళాశాల యాజమాన్యం జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ దాగి వుంది. పెద్ద ఎత్తున అడ్మిషన్లనే టార్గెట్ గా పెట్టుకున్న సదరు కళాశాల యాజమాన్యం.. ఎక్కడ ఖాళీ బిల్డింగ్ దొరికితే చాలు అక్కడ బ్రాంచీలు ఓపెన్ చేసి తమ విద్యా వ్యాపారాన్ని విస్తరించుకుంటూ పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఆ కాలేజీ కి అనుమతులు ఎన్ని? వారు నిర్వహిస్తున్న బ్రాంచీలు ఎన్ని ? అనే విషయం ఇప్పుడు ఇటు విద్యాశాఖతో పాటు అటు హన్మకొండ నగరంలో చర్చనీయాంశంగా...




