Sarkar Live

Author: Reported by Virat Avunuri

వివ‌రాట్ ఆవునూరి.. స‌ర్కార్ లైవ్ లో ఆయ‌న డిజిట‌ల్ కంటెంట్ ప్రొవైడ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 6 సంవ‌త్స‌రాలకుపైగా అనుభవం ఉంది. రాష్ట్ర‌, జాతీయ, అంత‌ర్జాతీయ అంశాల‌కు సంబంధించిన క‌థ‌నాల‌ను అందిస్తుంటారు.
Sub-Registrar | రూ.5000 లంచంతీసుకుంటూ ఏసీబీకి చిక్కిన స‌బ్ రిజిస్ట్రార్‌
Crime

Sub-Registrar | రూ.5000 లంచంతీసుకుంటూ ఏసీబీకి చిక్కిన స‌బ్ రిజిస్ట్రార్‌

Adilabad News : రాష్ట్రంలో అవినీతి అధికారులపై ఏసీబీ వరుస దాడులు కొనసాగిస్తోంది. అవినీతి అధికారుల‌కు ఏసీబీ చుక్క‌లు చూపిస్తోంది. వ‌రుస దాడుల‌తో అక్ర‌మార్కును హ‌డ‌లెత్తిస్తోంది. తాజాగా చిక్కాడు. ఆదిలాబాద్ జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌ ( Sub-Registrar )ను లంచం తీసుకుంటుండగా రెడ్ హాండెడ్‌గా ప‌ట్టుకుంది. శుక్రవారం మధ్యాహ్నం రిజిస్ట్రార్‌ కార్యాయంలో బాధితుడు నుంచి సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌ రెడ్డి రూ. 5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సిరిసన్నకు చెందిన మన్నూర్‌ ఖాన్‌ గిఫ్ట్ డీడ్ కోసం డాక్యుమెంట్ రైటర్ ద్వారా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. గిఫ్ట్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ రెడ్డి రూ. 10 వేలు డిమాండ్ చేశారు. చివ‌ర‌కు రూ.5 వేలకు ఒప్పందం కుదరగా మధ్యాహ్నం సమయంలో సబ్ రిజిస్ట్రార్‌ లంచం తాలూకు డ‌బ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ...
Hyderabad | కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర‌ విషాదం: రథానికి కరెంటు తీగలు తగిలి ఐదుగురు మృతి
Crime

Hyderabad | కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర‌ విషాదం: రథానికి కరెంటు తీగలు తగిలి ఐదుగురు మృతి

Hyderabad News | కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర‌ విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ రామంతాపూర్‌లో (Ramanthapur) అర్ధరాత్రి శ్రీకృష్ణాష్టమి (Sri Krishnashtami ) వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్‌ తీగలు (Electric Shock) తగిలి ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివ‌రాల్లోకి వెళితే.. కృష్ణాష్టమి సందర్భంగా రామంతాపూర్‌లోని గోకులేనగర్‌లో ఆదివారం రాత్రి ఊరేగింపు నిర్వహించారు. ఈ క్రమంలో రథాన్ని లాగుతున్న వాహనం ఒక్క‌సారిగా ఆగిపోయింది. దీంతో యువ‌కులు వాహ‌నాన్ని నిలిపివేసి చేతులతో లాగుతూ ముందుకు క‌దిలించారు. ఈ క్ర‌మంలోనే విద్యుత్ తీగలు తగలడంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది మందికి క‌రెంట్‌ షాక్‌ కొట్టింది. దీంతో వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లుగా దూరంగా పడిపోయారు. వీరిలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మ‌ర‌ణం చెందారు. కొంద‌రు సీపీఆర్‌ చేసేందుకు యత్నించినా ప్రాణాలు నిల‌వ‌లేదు. మరో నలుగ...
farmer’s protest | యూరియా కొరతపై నిర‌స‌న… గ‌జ్వేల్‌లో రైతుల రాస్తారోకో
State, Sangareddy

farmer’s protest | యూరియా కొరతపై నిర‌స‌న… గ‌జ్వేల్‌లో రైతుల రాస్తారోకో

farmer's protest in Gajwel : రైతులు మ‌ళ్లీ రోడ్డెక్కారు. యూరియా కొర‌త (urea shortage) వ‌ల్ల త‌మ పంట‌లు దెబ్బ‌తింటున్నాయ‌ని ఆందోళ‌నకు దిగారు. సిద్దిపేట జిల్లా (Siddipet District) గజ్వేల్ (Gajwel) సమీపంలోని రిమ్మనగూడ వద్ద రాజీవ్ ర‌హ‌దారిపై ఈ రోజు పెద్ద ఎత్తున రాస్తారోకో (rasta roko) చేపట్టారు. వర్షం పడుతున్నప్పటికీ వందలాది మంది రైతులు (Farmers) రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. రోడ్డు పైకి వందలాది మంది రైతులు ఈ రాస్తారోకో బీఆర్ఎస్ (BRS) నేతృత్వంలో జ‌రిగింది. వంద‌లాది మంది రైతులు భారీ సంఖ్య‌లో ఉద‌యం నుంచే గజ్వేల్ (Gajwel) వద్దకు చేరారు. రోడ్డు మధ్యలో కూర్చుని నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంట‌నే యూరియా సరఫరా చేయాల‌ని డిమాండ్ చేశారు. యూరియా ఇవ్వకపోతే పంటలు ఎండిపోతాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ బాధ‌ల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించ...
TSLPRB Jobs 2025 : అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాల భర్తీ – త్వరలో 118 పోస్టుల నోటిఫికేషన్
Career

TSLPRB Jobs 2025 : అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాల భర్తీ – త్వరలో 118 పోస్టుల నోటిఫికేషన్

TSLPRB : తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (TSLPRB) ఓ ముఖ్యమైన ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రాసిక్యూషన్‌ విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వ‌ర‌లోనే విడుదల చేయ‌నుంది. దీని ద్వారా మొత్తం 118 పోస్టులు భర్తీ చేయనున్న‌ట్టు TSLPRB తెలిపింది. న్యాయ విద్య పూర్తిచేసి, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది అభ్యర్థులకు సువ‌ర్ణావ‌కాశ‌మ‌ని పేర్కొంది. TSLPRB Jobs 2025 : మొత్తం ఖాళీల వివరాలు మల్టీ జోన్ – I 38 పోస్టులు ప్రత్యక్ష నియామకంతో భర్తీ చేస్తారు. 12 పోస్టులు లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌ (బ్యాక్‌లాగ్‌) ద్వారా భర్తీ చేయనున్నారు. మల్టీ జోన్ – II 57 పోస్టులు ప్రత్యక్ష నియామకంతో భర్తీ చేస్తారు. 11 పోస్టులు లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌ కింద భర్తీ అవుతాయి.ఇలా మొత్తం 118 మందిని నియ‌మించ‌న...
Rain Alert | నేడు రేపు భారీ వర్షాలు..
State

Rain Alert | నేడు రేపు భారీ వర్షాలు..

Rain Alert in Telangana | ఉత్తర తెలంగాణ జిల్లాల్లో శుక్రవారం, శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ ఒడిశా వైపు కదులుతోందని ఐఎండీ తెలిపింది. దీనితో పాటు, ఉపరితల ఆవర్తనం, ద్రోణి కూడా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం 12 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఇదిలా ఉండ‌గా బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం, వనపర్తి, నల్గొండ, మహబూబ్ నగర్, ములుగు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ...
error: Content is protected !!