Skip to main content

Sarkar Live

Author: Avunuri virat

ఆవునూరి విరాట్.. స‌ర్కార్ లైవ్ లో ఆయ‌న డిజిట‌ల్ కంటెంట్ ప్రొవైడ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 6 సంవ‌త్స‌రాలకుపైగా అనుభవం ఉంది. రాష్ట్ర‌, జాతీయ, అంత‌ర్జాతీయ అంశాల‌కు సంబంధించిన క‌థ‌నాల‌ను అందిస్తుంటారు.
South Central Railway | ద‌క్షిణ మ‌ధ్య రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం
Hyderabad

South Central Railway | ద‌క్షిణ మ‌ధ్య రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం

Hyderabad | దక్షిణ మధ్య రైల్వే (SCR- South Central Railway) ఈ ఏడాది ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య కాలంలో సరుకు రవాణా, ప్రయాణీకుల రైళ్ల‌ విభాగాలలో అత్యుత్తమ పనితీరును నమోదు చేసింది. గత సంవత్సరం అత్యధికంగా రూ.9,966 కోట్ల స్థూల ఆదాయాన్ని అధిగమించి రూ.10,143 కోట్ల స్థూల ఆదాయాన్ని ఆర్జించింది. SCR అధికారుల ప్రకారం, ఈ జోన్ 71.14 మిలియన్ టన్నుల (MTs) ఆల్ టైమ్ హై సరకు రవాణాను సాధించింది. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో 67 MTల నుంచి 6 శాతం పెరిగి, ఆదాయానికి రూ.6,635 కోట్లను అందించింది. ఇనుప ఖనిజం, ఉక్కు కర్మాగారాలకు ముడి పదార్థాలు, సిమెంట్ రవాణా పెరగడం వల్ల ఈ పెరుగుదల ప్రధానంగా జరిగిందని SCR జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. కాగా ప్రయాణీకుల ఆదాయం కూడా ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే వృద్ధిని నమోదు చేసుకుని రూ.2,991 కోట్లకు చేరుకుంది. ఇది 2024-25లో రూ.2,909 కోట్ల నుంచి 2.8 శాతం పెరిగింది. . వందే భారత...
Hyderabad |పెట్టుబడులకు తెలంగాణే సరైన గమ్యం
State, Hyderabad

Hyderabad |పెట్టుబడులకు తెలంగాణే సరైన గమ్యం

జీటో కనెక్ట్‌ 2025 ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధ‌ర్ బాబు Hyderabad : విలువలతో కూడిన వృద్ధికి కేరాఫ్‌గా తెలంగాణ రాష్ట్రం నిలుస్తోందని, దేశానికి రోల్ మోడల్‌గా అవతరించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పారిశ్రామికాభివృద్ధికి అత్యంత అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ హైటెక్స్‌ (Hyderabad itex), హెచ్‌ఐసీసీ లో మూడు రోజులపాటు జరుగుతున్న ‘జీటో కనెక్ట్‌ 2025’ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిలతో కలిసి ఆయన శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధ్ బాబు మాట్లాడుతూ, “ఇప్పటి పారిశ్రామికవేత్తలు కేవలం రాయితీలు, ప్రోత్సాహకాలు కాకుండా నైతికత, సమ్మిళితత, సుస్థిరతను పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నారు. భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా, భవిష్యత్తునే తెలంగ...
టెలికాం రంగంలో మరో మైలురాయి.. దేశవ్యాప్తంగా eSIM సేవ ప్రారంభించిన BSNL
Technology

టెలికాం రంగంలో మరో మైలురాయి.. దేశవ్యాప్తంగా eSIM సేవ ప్రారంభించిన BSNL

ఇప్పటివరకు, భారతదేశంలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు మాత్రమే eSIM సౌకర్యాన్ని అందించేవి. కానీ ఇప్పుడు BSNL కూడా ఈ సేవను ప్రారంభించింది. అంటే మీరు ఫిజిక‌ల్ సిమ్ కోసం ఒకే స్లాట్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తే, మీరు ఇప్పుడు BSNLను eSIMగా ఉపయోగించగలరు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. ఈ సేవ కోసం BSNL టాటా కమ్యూనికేషన్స్‌తో ఒప్పందం క‌దుర్చుకుంది. టాటా కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫామ్ "MOVE" eSIM సబ్‌స్క్రిప్షన్ కోసం ఉపయోగించబడుతుంది. ఈ సాంకేతికత GSMA ఆమోదించబడింది. ఇది పూర్తిగా సురక్షితం. eSIM స‌ర్వీస్‌ ప్రయోజనాలు BSNL eSIM 2G, 3G, 4G నెట్‌వర్క్‌లలో పనిచేస్తుంది. ఒకే సిమ్ స్లాట్, eSIM స్లాట్ ఉన్న మొబైల్ ఫోన్‌లను కలిగి ఉన్న వినియోగదారులు ఈ సేవను సద్వినియోగం చేసుకోవ‌చ్చు. వినియోగదారులు ఇకపై రెండు సిమ్ కార్డులను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది వారికి సౌ...
chhattisgarh : మావోయిస్టులకు భారీ షాక్
National

chhattisgarh : మావోయిస్టులకు భారీ షాక్

23 మంది మహిళా మావోయిస్టులు సహా 103 మంది మావోయిస్టుల లొంగుబాటు Chhattisgarh Naxal News : ఛత్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టు (Maoists ) ఉద్యమంపై భద్రతా దళాలు మరో కీలక విజయం సాధించాయి. శుక్ర‌వారం 103 మంది మావోయిస్టులు పోలీసుల‌కు లొంగిపోయారు. వీరిలో 23 మంది మహిళలు ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఛ‌త్తీస్‌గ‌ఢ్ అభ‌యార‌ణ్యం మావోయిస్టుల కార్య‌క‌లాపాల‌కు కేంద్రంగా ఉంది. కానీ ఇటీవల భద్రతా దళాలు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేపట్టిన యాక్ష‌న్ ప్లాన్‌, అవగాహన కార్యక్రమాలు, పునరావాస పథకాలు మావోయిస్టుల ఆలోచ‌న‌ల్లో గ‌ణ‌నీయ‌మైన‌ మార్పులు తీసుకొచ్చాయి. ఈ క్ర‌మంలోనే భారీ స్థాయిలో న‌క్స‌లైట్లు లొంగిపోతున్నారు. లొంగిపోయిన 103 మంది మావోయిస్టుల్లో 49 మందిపై రూ.1.06 కోట్లకు పైగా రివార్డు ఉండటం రాష్ట్ర ప్రభుత్వానికి, భద్రతా దళాలకు పెద్ద విజయంగా చెప్ప‌వ‌చ్చు.లొంగుబాటుతోపాటు పునరావాసం, ప్రధాన స్రవంత...
Kaleshwaram Project : కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ పై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం
State, Hyderabad

Kaleshwaram Project : కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ పై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ స‌ర్కారు సంచ‌ల‌న‌ నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరంలో దెబ్బతిన్న ముఖ్య‌మైన‌ బ్యారేజీలను పున‌రుద్ధ‌రించాల‌ని రాష్ట్ర‌ ప్రభుత్వం ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ప్రాజెక్టులోని కీల‌క‌మైన‌ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అవసరమైన కొత్త డిజైన్లను రూపొందించేందుకు అంతర్జాతీయ స్థాయి కంపెనీల‌ నుంచి ఆహ్వానానికి నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ క్రమంలో జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) దర్యాప్తు ఆధారంగా పునరుద్ధరణ చేయాలని నిర్ణయించింది. ఇక, వచ్చిన డిజైన్‌ టెండర్లను ప్రభుత్వం సీల్డ్‌ కవర్‌లో ఉంచుతుంది. ఈనెల 15న టెండర్లను ప్రభుత్వం తెరువ‌నుంది.కాగా, కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు ఈవోఐ పిలవాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా గత నెల 19న ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత కేవలం రెండు వారాల్లోగా డిజైన్ కన్సల్టెంట్‌ను ఎంపిక చే...
error: Content is protected !!