TSLPRB Jobs 2025 : అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాల భర్తీ – త్వరలో 118 పోస్టుల నోటిఫికేషన్
TSLPRB : తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (TSLPRB) ఓ ముఖ్యమైన ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రాసిక్యూషన్ విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనుంది. దీని ద్వారా మొత్తం 118 పోస్టులు భర్తీ చేయనున్నట్టు TSLPRB తెలిపింది. న్యాయ విద్య పూర్తిచేసి, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది అభ్యర్థులకు సువర్ణావకాశమని పేర్కొంది.
TSLPRB Jobs 2025 : మొత్తం ఖాళీల వివరాలు
మల్టీ జోన్ – I
38 పోస్టులు ప్రత్యక్ష నియామకంతో భర్తీ చేస్తారు.
12 పోస్టులు లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ (బ్యాక్‌లాగ్) ద్వారా భర్తీ చేయనున్నారు.
మల్టీ జోన్ – II
57 పోస్టులు ప్రత్యక్ష నియామకంతో భర్తీ చేస్తారు.
11 పోస్టులు లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ కింద భర్తీ అవుతాయి.ఇలా మొత్తం 118 మందిని నియమించన...

