Sarkar Live

Author: Avunuri virat

ఆవునూరి విరాట్.. స‌ర్కార్ లైవ్ లో ఆయ‌న డిజిట‌ల్ కంటెంట్ ప్రొవైడ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 6 సంవ‌త్స‌రాలకుపైగా అనుభవం ఉంది. రాష్ట్ర‌, జాతీయ, అంత‌ర్జాతీయ అంశాల‌కు సంబంధించిన క‌థ‌నాల‌ను అందిస్తుంటారు.
ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేయాలి – Congress Baki Card
State, Sangareddy

ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేయాలి – Congress Baki Card

ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ రూ.75 వేల రైతుబంధు బాకీ ప్రతి మహిళకు బాకీ పడ్డ 44 వేల ఇచ్చి ఓట్లు అడగాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్ సిద్దిపేటలో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల స‌ర్కార్ లైవ్, సిద్ధిపేట‌ : సిద్దిపేట (Siddipet) క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి హరీశ్ రావు (MLA Harish Rao) కాంగ్రెస్ బాకీ కార్డు ( Congress Baki Card)ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం బాకీ పడిందో ఇంటింటికీ తెలియజేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమేం బాకీ పడింది? ఒక్కో మహిళకు ఎంత బాకీ పడింది? ఒక్కొక్క రైతుకు ఎంత బాగి పడింది? ఒక్కో ఇంటికి ఎంత బాకీ పడ్డదో తెలిసేలా బాకీ కార్డు విడుదల చేస్తున్నామ‌ని తెలిపారు. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు పండుగకు ఊర్లకు వస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి బాకీ కార్డు ( Congress Baki Card) పంపిణీ చేయాల‌ని...
బ్యాంకింగ్‌, పోస్ట‌ల్‌, గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు రైలు టికెట్ బుకింగ్, పొదుపులపై వడ్డీ… అక్టోబర్ 1 నుండి ఎన్నో మార్పులు తెలుసుకోండి.. – October 1 2025 rules
Business

బ్యాంకింగ్‌, పోస్ట‌ల్‌, గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు రైలు టికెట్ బుకింగ్, పొదుపులపై వడ్డీ… అక్టోబర్ 1 నుండి ఎన్నో మార్పులు తెలుసుకోండి.. – October 1 2025 rules

October 1 2025 rules | అక్టోబర్ 1, 2025 నుండి దేశవ్యాప్తంగా ప్రజల దైనందిన జీవితాలను ప్రభావితం చేసే పలు ఆర్థిక, సాంకేతిక, సేవల మార్పులు అమల్లోకి రానున్నాయి. బ్యాంకింగ్, రైల్వే టికెటింగ్, NPS పెట్టుబడులు, చిన్న పొదుపు పథకాలు, LPG ధరలు, UPI చెల్లింపులు, స్పీడ్ పోస్ట్, ఆన్‌లైన్ గేమింగ్ వంటి విభాగాల్లో కొత్త నియమాలు అమలు కానున్నాయి. ఆధార్ లింక్డ్ ట్రైన్ టికెట్ బుకింగ్ అక్టోబర్ 1 నుండి, భారతీయ రైల్వేలు రిజర్వేషన్ విండోలోని మొదటి 15 నిమిషాల పాటు ఆధార్-లింక్డ్ IRCTC ఖాతాల ద్వారా మాత్రమే ప్రయాణీకుల టికెట్ బుకింగ్‌లను అనుమతిస్తాయి. కొత్త నియమం IRCTC వెబ్‌సైట్, దాని మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్‌లకు ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఆన్‌లైన్ రైలు బుకింగ్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లో, ఆధార్-ధృవీకరించబడిన వారు, అంటే వారి IRCTC ఖాతాకు ఆధార్ కార్డ్ లింక్ చేయబడిన వారు మాత్రమే రైలు టిక్కెట్లను బుక్ ...
State, Hyderabad

స్థానిక ఎన్నికల షెడ్యూల్ పూర్తి వివ‌రాలు ఇవే.. ఎలక్షన్స్ – Local Body Elections

Local Body Elections : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు (Telangana Gram Panchayat Elections 2025) అంతా సిద్ధ‌మైంది. అక్టోబర్‌ 9 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. మొద‌ట ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్‌ ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం ఐదు దశల్లో విడుతల్లో పోలింగ్ ను నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో, సర్పంచ్‌ ఎన్నికలను మూడు దశల్లో జరిపించ‌నున్నారు.ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్‌ను సోమ‌వారం ప్రకటించారు. అక్టోబర్‌ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడుత పోలింగ్‌, అదే నెల 27న రెండో విడుత పోలింగ్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. అక్టోబర్‌ 17న సర్పంచ్‌ ఎన్నికలకు తొలి విడుత నోటిఫికేషన్‌ విడుదల చేయ‌నున్నారు. అక్టోబర్‌ 31న సర్పంచ్‌ ఎన్నికల తొలి విడుత పోలింగ...
రాష్ట్రంలో మ‌రో మూడు రోజులు ముంచెత్త‌నున్న వ‌ర్షాలు – Hyderabad floods 2025
Hyderabad

రాష్ట్రంలో మ‌రో మూడు రోజులు ముంచెత్త‌నున్న వ‌ర్షాలు – Hyderabad floods 2025

Hyderabad floods 2025 : కొద్దిరోజులుగా భారీ వ‌ర్షాలు,వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మ‌వుతున్న‌ తెలంగాణ‌కు ఐఎండీ మ‌రోమారు వాతావ‌ర‌ణ‌ హెచ్చ‌రిక‌ జారీ చేసింది. రాష్ట్రంలో మరో మూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అక్టోబర్‌ ఒకటి నాటికి ఉత్తర, దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, జనగాం, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు ప...
ACB Arrest  : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై
Crime

ACB Arrest : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

ACB Raids | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఓ కేసు విషయంలో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ. 40 వేల డిమాండ్ చేశారనే ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. వీడియో, ఆడియోటేపుల ఆధారంగా ఎస్ఐ రంజిత్ ను పక్కా ప్లాన్​ వేసి పట్టుకున్నారు. సుమారు మూడు గంటలపాటు విచారించిన అధికారులు.. రంజిత్ లంచం డిమాండ్ చేసినట్లు నిర్ధారించారు. ఎస్ ఐ రంజిత్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసు వివరాలను ఖమ్మం ఏసీబీ ఇంచార్జ్ డీఎస్పీ విజయ్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన ఇద్దరు వ్యక్తులకు స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు వారి వద్ద నుంచి రూ.40వేలు ఎస్సై రంజిత్ డిమాండ్ చేశాడు. బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో వారు పక్కాగా వల పన్ని ఎస్ఐని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ సంఘటనతో మణుగూరులో కలకలం రేగింది. ప్రభుత్వ ఉద్యోగులు అవి...
error: Content is protected !!