Food Poisoning | హాస్టల్‌లో మారోమారు ఫుడ్ పాయిజన్ కలకలం: పురుగుల ఉప్మా తిని 13 మంది విద్యార్థులు అస్వస్థత..
Food Poisoning | గద్వాల: రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లలో వరుసగా ఫుడ్‌పాయిజన్ కేసులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా గద్వాల జిల్లాలో ఈరోజు ఉదయం మరో ఘటన వెలుగులోకి వచ్చింది. గద్వాలలోని ఎస్టీ హాస్టల్‌లో కలుషిత ఆహారం తినడం వల్ల 13 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటిన గద్వాల ప్రభుత్వ దవాహానకు తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ వసతి గృహంలో మొత్తం 120 మంది విద్యార్థులు ఉంటున్నారు.
పురుగులు ఉన్నాయని చెప్పినా నిర్లక్ష్యం!
ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలపై విద్యార్థులు సంచలన విషయాలు మీడియాకు వెల్లడించారు. ఉదయం వండిన ఉప్మాలో పురుగులు ఉన్నట్లు తాము గుర్తించి, వెంటనే హాస్టల్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లామని విద్యార్థులు పేర్కొన్నారు. అయితే వారు ఆ ఆహారాన్ని పారబోసినప్పటికీ, అంతకుముందు దాన్ని తిన్నవారే అస్వస్థతకు గురయ్యారని తెలిపార...




