Sarkar Live

Author: Avunuri virat

ఆవునూరి విరాట్.. స‌ర్కార్ లైవ్ లో ఆయ‌న డిజిట‌ల్ కంటెంట్ ప్రొవైడ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 6 సంవ‌త్స‌రాలకుపైగా అనుభవం ఉంది. రాష్ట్ర‌, జాతీయ, అంత‌ర్జాతీయ అంశాల‌కు సంబంధించిన క‌థ‌నాల‌ను అందిస్తుంటారు.
LPG Cylinder Price | LPG సిలిండర్ ధర నేటి నుంచి తగ్గింపు..
Business

LPG Cylinder Price | LPG సిలిండర్ ధర నేటి నుంచి తగ్గింపు..

హైదరాబాద్ : కొత్త నెల ప్రారంభం కావడంతో, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సామాన్యులపై భారం తగ్గించేలా నిర్ణయం తీసుకున్నాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి వాణిజ్య ఎల్‌పీజీ (LPG) సిలిండర్ల ధరల(LPG Cylinder Price)ను తగ్గించినట్లు ప్రకటించాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై దాదాపు రూ. 10 తగ్గింపు లభించింది. వాణిజ్య సిలిండర్ల కొత్త ధరలు (19 కేజీలు): నెలవారీ సమీక్షలో భాగంగా, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు నిరంతరం మారుతూ వొస్తున్నాయి. తాజా తగ్గింపు తర్వాత ప్రధాన నగరాల్లో 19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధరలు ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం ఇలా ఉన్నాయి: నగరంపాత ధర (నవంబర్)కొత్త ధర (డిసెంబర్ 1)మార్పు (సుమారు)ఢిల్లీ₹1,590.50₹1,580.50₹10 తగ్గింపుకోల్‌కతా₹1,694.00₹1,684.00₹10 తగ్గింపుముంబై₹1,541.50₹1,531.50₹10 తగ్గింపుచెన్నై₹1,749.50₹1,739.50₹10 తగ్గింపు గత కొన్ని నెలలుగా వాణిజ్య సిలిండర్ల ధరలు హెచ్...
Bus Accident : ఎదురెదురుగా ఢీకొన్న ప్రభుత్వ బస్సులు.. చిన్నారితో సహా 11 మంది మృతి
National

Bus Accident : ఎదురెదురుగా ఢీకొన్న ప్రభుత్వ బస్సులు.. చిన్నారితో సహా 11 మంది మృతి

Tamil Nadu Bus Accident | శివగంగ (తమిళనాడు) : తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శివగంగ జిల్లాలోని తిరుపత్తూరు సమీపంలో ఆదివారం సాయంత్రం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక చిన్నారితో సహా 11 మంది మృతిచెందిన‌ట్లు అధికారులు ధ్రువీకరించారు. అనేక మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన స్పందించిన స్థానికులు తిరుప్పూర్ నుంచి కరైకుడికి ఒక బస్సు, కరైకుడి నుంచి దిండిగల్‌కు మరొక బస్సు ప్రయాణిస్తుండగా, తిరుపత్తూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెంట‌నే స్పందించి క్ష‌త‌గాత్రుల‌కు అవ‌స‌ర‌మైన సాయం అందించారు. గాయపడిన వారిని హుటాహుటిన శివగంగైలోని ప్రభుత్వ హాస్పిట‌ల్‌కు తరలించారు. ఆ తర్వాత స్థానిక యంత్రాంగం, పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించాయి. కొంతమంది క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నందున...
Telangana Employees | ఉద్యోగులకు స‌ర్కారు గుడ్ న్యూస్‌
State, Hyderabad

Telangana Employees | ఉద్యోగులకు స‌ర్కారు గుడ్ న్యూస్‌

పెండింగ్ బిల్లులకు రూ. 707.30 కోట్లు విడుదల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు హైదరాబాద్: రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు (Telangana Employees) తెలంగాణ స‌ర్కారు గుడ్‌ న్యూస్ చెప్పింది. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు, పెండింగ్ బిల్లులకు సంబంధించిన రూ. 707.30 కోట్లను విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) తాజాగా ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు, ఆర్థిక శాఖ అధికారులు శనివారం నవంబర్ నెలకు సంబంధించిన ఈ నిధులను విడుదల చేశారు. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన మాట ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల రూ. 700 కోట్లకు పైగా నిధులను క్రమం తప్పకుండా విడుదల చేస్తూ వస్తోంది. నాలుగు నెలలుగా బకాయిల చెల్లింపు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, వరుసగా నాలుగు నెలలుగా ఉద్యోగుల పెండింగ్ బకాయిలను విడుదల చేస్తూ వస్తోంది. నవంబర్ నెల...
Cyclone Dhitwa ఎఫెక్ట్: తెలంగాణలో పెరిగిన చ‌లితీవ్ర‌త‌, ఆ జిల్లాల్లో వర్షాలు – తాజా వాతావరణ అంచనా
Hyderabad

Cyclone Dhitwa ఎఫెక్ట్: తెలంగాణలో పెరిగిన చ‌లితీవ్ర‌త‌, ఆ జిల్లాల్లో వర్షాలు – తాజా వాతావరణ అంచనా

Cyclone Dhitwa : బంగాళాఖాతంలో ఏర్పడిన 'దిత్వా' తుఫానుతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఈ తుఫాను నెమ్మదిగా కదులుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా వెల్లడించింది. తుఫాను ఆదివారం నాటికి పుదుచ్చేరి తీరాన్ని చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఉత్తర తెలంగాణలో చలి పంజా! దిత్వా తుఫాను ఎఫెక్ట్‌తో రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ గణనీయంగా పెరగనుంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనెల 30వ తేదీ వరకు ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన చలి గాలులు వీచే అవకాశముంది. ఈ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తిరిగి 9 డిగ్రీల నుంచి 11 డిగ్రీల సెల్సియస్కు పడిపోయే అవకాశం ఉంది.రాష్ట్ర‌ రాజధాని హైదరాబాద్‌లో కూడా మూడు రోజుల పాటు రాత్రి ఉష్ణోగ్రతలు 11 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదవుతాయని నిపుణులు హెచ్చ...
మావోయిస్టుల సంచలన ప్రకటన – Maoist Surrender Announcement
State

మావోయిస్టుల సంచలన ప్రకటన – Maoist Surrender Announcement

ఆయుధాలు వీడి ప్రధాన స్రవంతిలోకి – షరతులు వెల్లడి Maoist Surrender Announcement : సీపీఐ (మావోయిస్ట్)కు చెందిన మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ (MMCSZC) ఒక కీలక ప్రకటన చేసింది. ఈ జోన్ పరిధిలోని మావోయిస్టు కార్యకర్తలు అంద‌రూ జనవరి 1, 2026న ఆయుధాలు విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరనున్నట్లు ఎంఎంసీఎస్‌జెడ్‌సీ అధికార ప్రతినిధి అనంత్ వెల్లడించారు.ఈమేరకు ఆయన తాజాగా ఒక లేఖను విడుదల చేయడంతో పాటు, మీడియాకు ఆడియో క్లిప్‌లను విడుదల చేశారు.ప్రభుత్వాలకు లేఖ, నిర్ణయానికి సమయం గతంలో (నవంబర్ 22న) అనంత్… మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయ్ శర్మకు లేఖ రాశారు. ఏకాభిప్రాయానికి రావడానికి ఫిబ్రవరి 15, 2026 వరకు సమయం ఇవ్వాలని ఆ లేఖలో అభ్యర్థించిన విషయం తెలిసిందే. అయితే, హోంమంత్రి విజయ్ శర్మ ర...
error: Content is protected !!