Sarkar Live

Author: Avunuri virat

ఆవునూరి విరాట్.. స‌ర్కార్ లైవ్ లో ఆయ‌న డిజిట‌ల్ కంటెంట్ ప్రొవైడ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 6 సంవ‌త్స‌రాలకుపైగా అనుభవం ఉంది. రాష్ట్ర‌, జాతీయ, అంత‌ర్జాతీయ అంశాల‌కు సంబంధించిన క‌థ‌నాల‌ను అందిస్తుంటారు.
హైదరాబాద్‌లో ఘోరం : పిల్లల ముందే భార్యను తగలబెట్టిన భర్త.. అడ్డువచ్చిన కూతురిని కూడా మంటల్లోకి తోసి దారుణం!
Crime

హైదరాబాద్‌లో ఘోరం : పిల్లల ముందే భార్యను తగలబెట్టిన భర్త.. అడ్డువచ్చిన కూతురిని కూడా మంటల్లోకి తోసి దారుణం!

Hyderabad Nallakunta Murder Case : నగరంలోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో గుండె తరుక్కుపోయే విషాద ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. క్రిస్మస్ పండుగకు ముందు రోజు (డిసెంబర్ 24) తెల్లవారుజామున ఒక వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా పిల్లల ముందే పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ దారుణ ఘటనలో భార్య మరణించగా, తల్లిని కాపాడుకోవడానికి ప్రయత్నించిన చిన్నారికి గాయాలయ్యాయి. ప్రేమ వివాహం.. అనుమానంతో వేధింపులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు త్రివేణి (26), నిందితుడు వెంకటేష్ నల్గొండ జిల్లా హుజురాబాద్ నివాసితులు. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నరేష్, సాత్విక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా వెంకటేష్ తన భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమెను తరచుగా శారీరకంగా, మానసిక వేధింపులకు గురిచేసేవాడు. దీంతో త్రివేణి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయినప్పటికీ, వెంకటేష్ తన ప్రవర్తన మార్చుకుం...
Journalist | జర్నలిస్టుల ‘అక్రిడిటేషన్’ జీవోపై రగడ: 27న కలెక్టరేట్ల ముట్టడికి TUWJ పిలుపు!
State, warangal

Journalist | జర్నలిస్టుల ‘అక్రిడిటేషన్’ జీవోపై రగడ: 27న కలెక్టరేట్ల ముట్టడికి TUWJ పిలుపు!

జి.ఓ నంబర్ 252ను వెంటనే సవరించాలి రెండు కార్డుల విధానం వద్దు.. 10 వేల కార్డుల కోతపై ఆగ్రహం డెస్క్ జర్నలిస్టులకు, కేబుల్ ఛానళ్లకు అన్యాయం హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడిటేషన్ల కోసం జారీ చేసిన జి.ఓ నంబర్ 252 తీవ్ర లోపభూయిష్టంగా ఉందని, దీనివల్ల వేలాది మంది జర్నలిస్టులు తమ హక్కులను కోల్పోతున్నారని TUWJ (తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్) ధ్వజమెత్తింది. ఈ అనాలోచిత జీవోను నిరసిస్తూ ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు భారీ ఆందోళనలు చేపట్టనున్నట్లు యూనియన్ ప్రకటించింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో TUWJ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, కోశాధికారి పి.యోగనంద్, టెంజు ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్, ఐజేయు నేత అవ్వారి భాస్కర్ తదితరులు మాట్లాడారు. జీవోలోని ప్రధాన లోపాలు - TUWJ అభ్యంతరాలు:...
Bus Accident | బస్సు – లారీ ఢీకొని చెలరేగిన మంటలు.. 13 మంది సజీవ దహనం!
Crime

Bus Accident | బస్సు – లారీ ఢీకొని చెలరేగిన మంటలు.. 13 మంది సజీవ దహనం!

చిత్రదుర్గ : కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో గురువారం తెల్లవారుజామున అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారి 48 (NH-48)పై ప్రైవేట్ బస్సు - లారీ పరస్పరం (Bus Accident) ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాల్లో మంటలు చెలరేగడంతో 13 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరు నుంచి శివమొగ్గకు 32 మంది ప్రయాణికులతో వెళ్తున్న 'సీ బర్డ్' (Sea Bird) ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును, ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. హిరియూర్ సమీపంలోని గోర్లాతు గ్రామం వద్ద తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలి వైపు వస్తున్న బస్సును ఢీకొట్టిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మంటల్లో చిక్కుకున్న వాహనాలు ఢీకొన్న వెంటనే రెండు వాహనాల్లో భారీగా మంటలు చెలరేగాయి. బస్సులో గాఢనిద్రలో ఉన్న ప్రయాణ...
KTR : కాంగ్రెస్‌ది పక్కా మాఫియా పాలన
State, Hyderabad

KTR : కాంగ్రెస్‌ది పక్కా మాఫియా పాలన

ఇసుక మాఫియా కోసం చెక్‌డ్యామ్‌లపై డైనమైట్లు – ప్రభుత్వ కనుసన్నల్లోనే విధ్వంసం హైదరాబాద్‌ : తెలంగాణలో నడుస్తోంది ప్రజా పాలన కాదు, పక్కా మాఫియా పాలన అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇసుక మాఫియా లాభాల కోసం కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన చెక్‌డ్యామ్‌లను డైనమైట్లు పెట్టి పేల్చేస్తున్నారని ఆరోపించారు. ప్రపంచ ప్రఖ్యాత ‘వాటర్‌మ్యాన్’ రాజేంద్ర సింగ్ దీనిని మానవ నిర్మిత విధ్వంసంగా పేర్కొన్నా, ప్రభుత్వానికి చీమ కుట్టినట్టూ లేదని విమర్శించారు. డ్రిల్లింగ్ మెషీన్లతో రంధ్రాలు చేసి, జెలటిన్ స్టిక్స్‌తో పేల్చినట్లు సాక్ష్యాలతో నిరూపించారని తెలిపారు. భూగర్భ జలాలు పెంచేందుకు చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తే, వాటిని కూల్చి రైతుల పొలాలను ఎడారులుగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వం కాదని, గ్యాంగ్‌స్టర్ల అడ్డా అని నిలదీశారు. ప్రకృతి వైపరీత్యం వల...
Property Tax | హైదరాబాద్‌వాసులకు జీహెచ్‌ఎంసీ బంపర్ ఆఫర్
State, Hyderabad

Property Tax | హైదరాబాద్‌వాసులకు జీహెచ్‌ఎంసీ బంపర్ ఆఫర్

ఆస్తి పన్ను (Property Tax) వడ్డీపై 90 శాతం రాయితీ! హైదరాబాద్, డిసెంబర్ 22: చాలా కాలంగా ఆస్తి పన్ను బకాయిలు ఉన్న భాగ్యనగర వాసులకు రాష్ట్ర ప్రభుత్వం మరియు జీహెచ్‌ఎంసీ (GHMC) తీపి కబురు అందించాయి. బకాయిలపై పేరుకుపోయిన వడ్డీ భారాన్ని తగ్గించేందుకు 'వన్‌ టైమ్‌ సెటిల్మెంట్' పథకాన్ని ప్రకటించారు. ఈ స్కీమ్ కింద పాత బకాయిలపై ఉన్న వడ్డీలో ఏకంగా 90 శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పథకం ముఖ్యాంశాలు:90% వడ్డీ మాఫీ: పన్ను చెల్లింపుదారులు తమ అసలు పన్ను మొత్తంతో పాటు, దానిపై ఉన్న వడ్డీలో కేవలం 10 శాతం చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 90 శాతం వడ్డీని కార్పొరేషన్ పూర్తిగా రద్దు చేస్తుంది. ఎవరికి వర్తిస్తుంది?: ఈ రాయితీ కేవలం ప్రైవేట్ వ్యక్తులకే కాకుండా, ప్రభుత్వ ఆస్తులకు కూడా వర్తిస్తుంది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయ పరిధితో పాటు, ఇటీవల గ్రేటర్‌లో విలీనమైన 20 మున్సిపాలిటీలు,...
error: Content is protected !!