Mamnoor Airport | మామునూరు ఎయిర్‌పోర్ట్‌పై కీలక పరిణామం..
Warangal Mamnoor Airport | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ విమానాశ్రయం రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం ఉన్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమానంగా, ఆధునిక సదుపాయాలతో వరంగల్ సమీపంలోని మామునూర్ వద్ద కొత్త విమానాశ్రయ నిర్మాణం (Mamnoor Airport) జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం తాజాగా రూ.90 కోట్ల నిధులను అదనంగా మంజూరు చేసింది. ఈ మేరకు రవాణా, రోడ్లుచ భవనాల (విమానాశ్రయాలు) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
రైతులకు నష్టపరిహారం
గతంలోనే ప్రభుత్వం రూ.205 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈసారి కొత్తగా విడుదలైన నిధులతో కలిపి భూసేకరణ కోసం మొత్తం 295 కోట్లను కేటాయింట్లు అయింది. భూములను కోల్పోతున్న రైతులు, యజమానులకు నష్టపరిహారం చెల్లించడానికి ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. వరంగల్ రెవెన్యూ డివిజనల్ అధికారికి ఈ నిధులు బదిలీ చేయనున్నట్టు తెలుస్...




