Pawan Kalyan | విడుదలకు సిద్ధమవుతున్న హరిహర వీరమల్లు
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీ జూన్ 12న రిలీజ్‌కి రెడీ అయింది. అయితే ఇదే సమయంలో తమ డిమాండ్ల సాధన కోసం సినిమా థియేటర్లను మూసివేస్తామని ఎగ్జిబ్యూటర్లు నిర్మాతలను హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పవర్‌స్టార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా సినిమా సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిశారా ? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం సినిమా పరిశ్రమలను ఎలా చూసిందో, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టిందో మరిచిపోయారా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిలదీశారు.
ఇకపై వ్యక్తిగత చర్చలు ఉండవని, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గి...