Murugadoss : మురుగదాస్ రిస్క్ చేస్తున్నాడా…?
Tollywood News | ఒకప్పుడు మురుగదాస్ (Murugadoss)నుండి సినిమా వస్తుందంటే సినీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఆ రేంజ్ లో మురుగదాస్ టేకింగ్ ఉండేది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా బడా హీరోలు తను కథ చెబితే చాలు డేట్స్ ఇచ్చేవారు. అలాంటి డైరెక్టర్ కొద్ది కాలంగా వరుస ఫ్లాఫ్ లతో ఇబ్బంది పడుతున్నాడు.
రమణ (Ramana) మూవీని విజయ్ కాంత్ తో తీసి బంపర్ హిట్టు కొట్టాడు. ఆ మూవీని తెలుగులో వీవీ వినాయక్ డైరెక్షన్లో ఠాగూర్ (Tagur) తీసి సంచలన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మురుగదాస్ డైరెక్షన్లో సూర్య (Surya)హీరోగా గజిని, హిందీలో అమీర్ ఖాన్ గజినీ (Ameer Khan gajini), సెవెన్త్ సెన్స్,కత్తి ,తుపాకీ ఇలాంటి మూవీస్ తో తను ఎంత పొటెన్షియల్ ఉన్న డైరెక్టరో ఆడియన్స్ కి చూపెట్టాడు.
ఇంకా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన మహేష్ బాబు స్పైడర్(Mahesh spider)మూవీ తన కెరీర్ ని ప్రమాదంలోకి నెట్టేసింది. ఈ మూవీ...




