Jatadhara Movie : జటాధర రిలీజ్ డేట్ ఫిక్స్..!
Jatadhara Release Date : టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు బావగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. SMS, శివ మనసులో శృతి సినిమాలతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన, మారుతి దర్శకత్వం వహించిన ప్రేమ కథా చిత్రంతో భారీ విజయం సాధించాడు. ఆ తర్వాత సమ్మోహనం, భలే మంచి రోజు వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
అయితే గత కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేదు. ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత, భారీ మైథలాజికల్ జానర్ మూవీ జటాధరతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తుండగా, జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సుధీర్ బాబుతో పాటు బాలీవుడ్ స్టార్ సోనాక్షి సిన్హా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ విడుదల చేసిన పోస్టర్, తర్వాత విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన...



