ప్రభాస్-అమరన్ డైరెక్టర్ కాంబినేషన్ ఫిక్స్..? త్వరలో భారీ సినిమా అనౌన్స్‌మెంట్..! Prabhas Next movie
Prabhas Next Movie | శివకార్తికేయన్ (Siva Karthikeyan) కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా అమరన్ (Amaran)మూవీ నిలిచిపోయింది. సాయి పల్లవి, శివకార్తికేయన్ నటనతో ఆడియన్స్ కంటతడి పెట్టించాడు. ఈ మూవీతో డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి(Rajkumar periya Swami)పేరు మారు మోగిపోయింది. ఆ మూవీని అంత ఎమోషనల్ గా తెరకెక్కించిన విధానానికి బడా స్టార్స్ కూడా ఆయన డైరెక్షన్ లో చేయడానికి ముందుకు వస్తున్నారు.
డైరెక్టర్ మాత్రం చాలా సెలెక్టివ్ గా తన నెక్స్ట్ మూవీ ఉండేలా చూసుకుంటున్నాడు. ఇప్పటికే తన నెక్స్ట్ మూవీ సూర్య,రజినీకాంత్ తో చేస్తున్నట్టు టాక్ వినబడ్డా అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఇప్పుడు మరో స్టార్ హీరోతో మూవీ చేయనున్నట్టు ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ డార్లింగ్ హీరో ప్రభాస్(Rebal Star Prabhas )తో మూవీ చేయనున్నట్టు ఫిలిం నగర్ టాక్.
ఇప్పటికే డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి ప్రభా...