Bhupalpally | సామాజిక కార్యకర్త దారుణ హత్య.. అసలేం జరిగిందంటే..
Bhupalpally : భూపాలపల్లి పట్టణంలో నిన్న సాయంత్రం జరిగిన దారుణ హత్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అవినీతిపై పోరాడుతున్న ఓ సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగం మూర్తి (Nagavelli Rajalinga Murthy)ని పేగులు బయటపేడేలా పొడిచి చంపడం కలకలం రేపింది. ఈ హత్య వెనుక కారణాలపై పోలీసులు ముమ్మరంగా విచారణ చేపడుతున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం మూర్తి హత్య వెనుక రాజకీయ కుట్ర లేదా పెద్ద ఆర్థిక ప్రయోజనాలే ఉన్నాయని తెలిసింది. అవినీతిపై పోరాడుతున్న మూర్తి పోరాడుతుండటం వల్ల కొంతమందికి భారీగా ఆర్థిక నష్టం జరిగిందని, ఆ కోపంతోనే ఈ హత్య జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును CID లేదా SIT ద్వారా విచారణ చేపట్టాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు.
ఉలిక్కిపడిన భూపాలపల్లి
మూర్తి తన ద్విచక్ర వాహనంపై భూపాలపల్లి పట్టణంలోని రెడ్డి కాలనీలో బుధవారం సాయంత్రం 7:30 గంటల సమయంలో...