Laddoo Mahotsav | యూపీలో విషాదం.. ఆదినాథ్ లడ్డూ మహోత్సవంలో అపశ్రుతి
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ (Uttar Pradesh's Baghpat)లో మంగళవారం ఉదయం ఘోర ఘటన చోటు చేసుకుంది. ఆదినాథ్ ఆలయంతో ఏర్పాటు చేసిన నిర్వాణ లడ్డూ మహోత్సవం (Laddoo Mahotsav) సందర్భంగా మాన్ స్తంభ్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఓ స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. సుమారు 60 మందికి పైగా భక్తులు స్టేజ్ కింద పడిపోయారు.
ఆరుగురి మృతి, 50 మందికి గాయాలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్‌పత్ జిల్లాలోని ఆదినాథ్ ఆలయంలో ఈ రోజు జరిగిన లడ్డూ సమర్పణ మహోత్సవం (Laddoo Mahotsav)లో అపశ్రుతి చోటోచేసుకుంది. స్టేజ్ కుప్ప కూలిపోవడంతో ఆరుగురు మృతి చెందారు. మరో సుమారు 50 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు.
Laddoo Mahotsav దుర్ఘటన ఎలా జరిగింది ?
జైనుల (Jain community) సంప్రదాయంలోని ఎంతో ముఖ్యమైన ఆదినాథుని లడ్డూ సమర్పణ కార్యక్రమంలో దుర్ఘటన చోటు ...