Sarkar Live

Crime

Chhattisgarh : ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోయిస్టులు మృతి
Crime

Chhattisgarh : ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోయిస్టులు మృతి

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం (Bastar district) లోని అబుజ్మద్ అడవుల్లో భారీ కాల్పులు జ‌రిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోయిస్టులు మరణించినట్లు చెబుతున్నారు. నారాయణపూర్ పోలీస్ సూపరింటెండెంట్ ప్రభాత్ కుమార్ ప్రకారం, మావోయిస్టుల మాడ్ డివిజన్‌కు చెందిన అగ్రశ్రేణి క్యాడర్లు ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్, కొండగావ్ జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) బుధవారం తెల్లవారుజామున సంయుక్త ఆపరేషన్ ప్రారంభించాయి. చత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రం బీజాపూర్ – నారాయణపూర్ జిల్లాల మధ్య గల మాడ్ డివిజన్ పరిధిలోని అబూజ్మాడ్ అడవుల్లో భద్రతా దళాలు సెర్చింగ్ ఆపరేషన్ కొన‌సాగిస్తున్నాయి. బుధవారం ఉదయం వారికి మావోయిస్టులు ఎదురుప‌డి జవాన్లపై కాల్పులు ప్రారంభించారు. దీంతో ఇరు వర్గాల మధ్య భీకర పోరు జ‌రిగింది. ఇప్పటి వరకు ఈ ఎదురు కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్...
పాకిస్తాన్ కోసం గూఢచర్యం ఆరోపణలు.. యూపీ వ్యాపారవేత్త అరెస్టు – Uttar Pradesh police
Crime

పాకిస్తాన్ కోసం గూఢచర్యం ఆరోపణలు.. యూపీ వ్యాపారవేత్త అరెస్టు – Uttar Pradesh police

Uttar Pradesh police UP businessman : పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తోంద‌నే ఆరోపణలపై హర్యానాకు చెందిన యూట్యూబర్, ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు అయిన కొన్ని రోజుల తర్వాత, పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) రాంపూర్‌కు చెందిన ఒక వ్యాపారవేత్తను అరెస్టు చేసింది. పాకిస్తాన్ తరఫున సరిహద్దు అక్రమ రవాణా, గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు STF కి నిఘా సమాచారం అందడంతో నిందితుడు షాజాద్‌ను మొరాదాబాద్‌లో అరెస్టు చేశారు. అధికారుల ప్రకారం, షాజాద్ జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్‌లోని తన నిర్వాహకులకు చేరవేస్తున్నాడు ఇటీవలి సంవత్సరాలలో వ్యాపారం నిర్వహించే నెపంతో షాజాద్ అనేకసార్లు పాకిస్తాన్‌ను సందర్శించాడని STF ఒక ప్రకటనలో తెలిపింది. అతను సౌందర్య సాధనాలు, బట్టలు, సుగ...
ఘోర అగ్ని ప్రమాదం.. 17 మంది మృతి
Crime

ఘోర అగ్ని ప్రమాదం.. 17 మంది మృతి

Fire accident in Hyderabad : హైదరాబాద్ చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుల్జార్ హౌస్‌లోని మొదటి అంతస్తులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఇంట్లో ఏర్పాటు చేసిన ఏసీ కంప్రెషర్ పేలి మంటలు చెలరేగినట్లు (Fire Accident) అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయారు. ఘటనా స్థలిలోనే నలుగురు చనిపోగా.. మరో 13 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. మరికొంతమంది గాయపడగా.. క్షతగాత్రులను మలక్‌పేటలోని యశోద ఆస్పత్రి, అపోలో, డీఆర్డీవో ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు....
ACB Raids | పెండింగ్ బిల్లుల కోసం డబ్బుల డిమాండ్.. పక్కా వ్యూహంతో పట్టుకున్న ఏసీబీ
State, Crime

ACB Raids | పెండింగ్ బిల్లుల కోసం డబ్బుల డిమాండ్.. పక్కా వ్యూహంతో పట్టుకున్న ఏసీబీ

ACB Raids | ఇటీవ‌ల కాలంలో ఏసీబీ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. అదును చూసి ప‌క్కా వ్యూహంతో అవినీతి తిమింగ‌ళాల‌ను ప‌ట్టుకుంటోంది. తాజాగా ఓ వ్య‌క్తి నుంచి భారీగా డ‌బ్బులు డిమాండ్ చేస్తున్న‌ రాజన్న సిరిసిల్ల జిల్లా నీటి పారుదల శాఖ (Irrigation Department)ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)ని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. స‌ద‌రు అవినీతి అధికారి ఏకంగా రూ. 60,000/- లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sirisilla ) నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) గా విధులు నిర్వహిస్తున్న ఎర్రంరెడ్డి అమరేందర్ రెడ్డి జిల్లాలోని ముస్తాబాద్ మండలం ఆవునూరు-అగ్రహారం మధ్య‌లో నిర్మించిన చెక్ డ్యాం బిల్లుల విడుదల కోసం హన్మకొండకు చెందిన సూరం రవీందర్ అనే కాంట్రాక్టర్ వద్ద రూ.లక్ష లంచం డిమాండ్ చేశాడు. చివ‌ర‌కు బేరం రూ.75 వేలకు కుదిరింది. కరీంనగర్ లోని విద...
Chhattisgarh | ఒక‌వైపు ఆప‌రేష‌న్ సిందూర్‌.. మ‌రోవైపు ఆప‌రేష‌న్ క‌గార్‌
Crime

Chhattisgarh | ఒక‌వైపు ఆప‌రేష‌న్ సిందూర్‌.. మ‌రోవైపు ఆప‌రేష‌న్ క‌గార్‌

క‌ర్రెగుట్ట‌ల్లో భారీ ఎన్‌కౌంట‌ర్.. 23 మంది మావోయిస్టుల హతం..? Operation Kagar in Chhattisgarh | ప‌హ‌ల్గామ్ దాడి (Pahelgam)కి ప్ర‌తీకారంగా భారత ఆర్మీ ఒక‌వైపు ఆప‌రేష‌న్ సిందూర్ (Operation Sindoor) చేప‌ట్టి ఉగ్ర‌వాదుల‌కు వ‌ణుకు ప‌ట్టించ‌గా మ‌రోవైపు ఆప‌రేష‌న్ క‌గార్ పేరుతో మావోయిస్టుల భ‌ర‌తం ప‌డుతోంది. తాజాగా తెలంగాణ – ఛత్తీస్‌గ‌ఢ్‌ సరిహద్దుల్లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. వివరాలు.. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ బీజాపూర్ జిల్లా కర్రెగుట్టల్లో గత రెండు వారాల పైగా వేల సంఖ్యలో భద్రతా దళాలు మావోయిస్టుల వేటను కొన‌సాగిస్తున్న విష‌యం తెలిసిందే.. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సుమారు పది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. తాజాగా బుధవారం ఉదయం Chhattisgarh లోని కర్రెగుట్ట (Karregutta) ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు ఎదురుప‌డ్డారు. ఈ క్రమంలో...
error: Content is protected !!