Sarkar Live

Crime

Tirumala Temple |  తిరుమల హుండీలో డబ్బులు చోరీ చేసిన భక్తుడు అరెస్ట్
Crime

Tirumala Temple | తిరుమల హుండీలో డబ్బులు చోరీ చేసిన భక్తుడు అరెస్ట్

Tirupati: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమ‌ల దేవాలయం (Tirumala Temple )లో ఓ భక్తుడు హుండీలో డబ్బును దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటన నవంబర్ 23న చోటుచేసుకోగా ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదుతో ఆల‌స్యంగా వెలుగులోకి వచ్చింది. తమిళనాడుకు చెందిన వేణు లింగం అనే నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు అతని నుంచి రూ.15,000 న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 23న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగిన ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యిందని, సీసీటీవీ ఫుటేజీని ప‌రిశీలించిన ఆల‌య సెక్యూరిటీ సిబ్బంది వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో హుండీ చుట్టూ టీటీడీ భద్రతను మ‌రింత‌ కట్టుదిట్టం చేశారు. కాగా, ప్...
ACB | ఏసీబి వలలో ఇరిగేషన్ ఏఈ.. రూ.20వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
Crime

ACB | ఏసీబి వలలో ఇరిగేషన్ ఏఈ.. రూ.20వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత

పెద్దపల్లి జిల్లా :  తెలంగాణ‌ రాష్ట్రంలో లోని ఇటీవ‌ల కాలంలో ఏసీబీ (ACB) దాడుల్లో అవ‌నీతికి పాల్ప‌డే అధికారులు చిక్కుతున్నారు. ఇందులో పోలీసు అధికారులు కూడా ఉన్నారు. సోమ‌వారం పెద్ద‌ప‌ల్లి ప‌ట్ట‌ణం ఎస్ఆర్‌సీ నీటి పారుద‌ల శాఖ (Irrigation ) అసిస్టెంట్ ఇంజ‌నీర్ న‌ర్సింగ‌రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్డుపైనే ఓ వ్య‌క్తి నుంచి లంచం డ‌బ్బులు తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కాంట్రాక్ట‌ర్‌కు ఓ బిల్లు విష‌యంలో ఏఈ న‌ర్సింగ‌రావుకు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆ కాంట్రాక్ట‌ర్ ఏసీబీ అధికారుల‌ను ఆశ్ర‌యించారు. రోడ్డుపైనే ఏఈకి కాంట్రాక్ట‌ర్ రూ.20,000లు అంద‌జేశారు. అక్క‌డే మాటు వేసిన ఏసీబీ డీఎస్‌పీ ర‌మ‌ణ‌మూర్తి ఆధ్వ‌ర్యంలో సిబ్బంది దాడి చేసి ప‌ట్టుకున్నారు. అలాగేనీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీసుకు ఆయ‌న్ని తీసుకువచ్చి విచారిస్తున్నారు. కార్యాల‌యంలో రికార్డుల‌ను ప‌రిశీలిస...
error: Content is protected !!