Chhattisgarh | ఒకవైపు ఆపరేషన్ సిందూర్.. మరోవైపు ఆపరేషన్ కగార్
కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. 23 మంది మావోయిస్టుల హతం..?
Operation Kagar in Chhattisgarh | పహల్గామ్ దాడి (Pahelgam)కి ప్రతీకారంగా భారత ఆర్మీ ఒకవైపు ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టి ఉగ్రవాదులకు వణుకు పట్టించగా మరోవైపు ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల భరతం పడుతోంది. తాజాగా తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. వివరాలు.. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా కర్రెగుట్టల్లో గత రెండు వారాల పైగా వేల సంఖ్యలో భద్రతా దళాలు మావోయిస్టుల వేటను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సుమారు పది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
తాజాగా బుధవారం ఉదయం Chhattisgarh లోని కర్రెగుట్ట (Karregutta) ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో...




