Police Encounter : ఎన్‌కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తో సహా నలుగురు హతం..
UP Police Encounter News : ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF )తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ కరుడుగట్టిన నేరస్తుడితోపాటు అతని ముగ్గురు సహచరులు హతమయ్యారు. సదరు గ్యాంస్టర్ పై ఇప్పటికే లక్ష రూపాయల రివార్డు ఉంది. ఈ మేరకు మంగళవారం అధికారులు మీడియాకు వివరాలు వెల్లడించారు. సోమవారం, మంగళవారం మధ్య రాత్రి షామ్లీలోని జింఝానా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక STF ఇన్‌స్పెక్టర్‌కు కూడా అనేక బుల్లెట్‌లు తగిలి గాయాలపాలయ్యారు.
STF అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) అమితాబ్ యాష్ ఒక ప్రకటనలో, "సోమవారం అర్దరాత్రి,STF మీరట్ బృందంతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో, ముస్తఫా కగ్గా గ్యాంగ్ సభ్యుడు అర్షద్‌తోపాటు అతని ఇతర ముగ్గురు సహచరులు మంజీత్, సతీష్, మరో గుర్తు తెలియని మృతిచెందారు.
అడిషనల్ డిజిపి అమితాబ్ యష్ మాట్లాడుతూ, “సహారన్‌పూర్‌లోని బెహత్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ...




