Skip to main content

Sarkar Live

Crime

ACB Raids | పెండింగ్ బిల్లుల కోసం డబ్బుల డిమాండ్.. పక్కా వ్యూహంతో పట్టుకున్న ఏసీబీ
State, Crime

ACB Raids | పెండింగ్ బిల్లుల కోసం డబ్బుల డిమాండ్.. పక్కా వ్యూహంతో పట్టుకున్న ఏసీబీ

ACB Raids | ఇటీవ‌ల కాలంలో ఏసీబీ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. అదును చూసి ప‌క్కా వ్యూహంతో అవినీతి తిమింగ‌ళాల‌ను ప‌ట్టుకుంటోంది. తాజాగా ఓ వ్య‌క్తి నుంచి భారీగా డ‌బ్బులు డిమాండ్ చేస్తున్న‌ రాజన్న సిరిసిల్ల జిల్లా నీటి పారుదల శాఖ (Irrigation Department)ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)ని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. స‌ద‌రు అవినీతి అధికారి ఏకంగా రూ. 60,000/- లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sirisilla ) నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) గా విధులు నిర్వహిస్తున్న ఎర్రంరెడ్డి అమరేందర్ రెడ్డి జిల్లాలోని ముస్తాబాద్ మండలం ఆవునూరు-అగ్రహారం మధ్య‌లో నిర్మించిన చెక్ డ్యాం బిల్లుల విడుదల కోసం హన్మకొండకు చెందిన సూరం రవీందర్ అనే కాంట్రాక్టర్ వద్ద రూ.లక్ష లంచం డిమాండ్ చేశాడు. చివ‌ర‌కు బేరం రూ.75 వేలకు కుదిరింది. కరీంనగర్ లోని విద...
Chhattisgarh | ఒక‌వైపు ఆప‌రేష‌న్ సిందూర్‌.. మ‌రోవైపు ఆప‌రేష‌న్ క‌గార్‌
Crime

Chhattisgarh | ఒక‌వైపు ఆప‌రేష‌న్ సిందూర్‌.. మ‌రోవైపు ఆప‌రేష‌న్ క‌గార్‌

క‌ర్రెగుట్ట‌ల్లో భారీ ఎన్‌కౌంట‌ర్.. 23 మంది మావోయిస్టుల హతం..? Operation Kagar in Chhattisgarh | ప‌హ‌ల్గామ్ దాడి (Pahelgam)కి ప్ర‌తీకారంగా భారత ఆర్మీ ఒక‌వైపు ఆప‌రేష‌న్ సిందూర్ (Operation Sindoor) చేప‌ట్టి ఉగ్ర‌వాదుల‌కు వ‌ణుకు ప‌ట్టించ‌గా మ‌రోవైపు ఆప‌రేష‌న్ క‌గార్ పేరుతో మావోయిస్టుల భ‌ర‌తం ప‌డుతోంది. తాజాగా తెలంగాణ – ఛత్తీస్‌గ‌ఢ్‌ సరిహద్దుల్లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. వివరాలు.. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ బీజాపూర్ జిల్లా కర్రెగుట్టల్లో గత రెండు వారాల పైగా వేల సంఖ్యలో భద్రతా దళాలు మావోయిస్టుల వేటను కొన‌సాగిస్తున్న విష‌యం తెలిసిందే.. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సుమారు పది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. తాజాగా బుధవారం ఉదయం Chhattisgarh లోని కర్రెగుట్ట (Karregutta) ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు ఎదురుప‌డ్డారు. ఈ క్రమంలో...
ACB | ఏసీబీకి చిక్కిన జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
Crime

ACB | ఏసీబీకి చిక్కిన జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్

వరంగల్ : ములుగు జిల్లా (Mulugu District) లోని జిల్లా ప్రజా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాదెగోని సుధాకర్, జూనియర్ అసిస్టెంట్ సానికొన్ను సౌమ్యను తెలంగాణ ACB అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదుదారుడి వైద్య సెలవు కోసం జీత బిల్లులను సిద్ధం చేయడానికి, ములుగు జిల్లా ట్రెజరీ కార్యాలయానికి సమర్పించడానికి అధికారిక అనుకూలంగా వ్యవహరించినందుకు ఫిర్యాదుదారుడి నుండి రూ.25,000/- లంచం డిమాండ్ చేసి స్వీకరించారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు పక్కగా వలపన్ని అవినీతికి పాల్పడిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుధాకర్ ను అలాగే జూనియర్ అసిస్టెంట్ సౌమ్యను పట్టుకున్నారు. ఇదిలా ఉండ‌గా సోమ‌వారం వికారాబాద్ (Vikarabad) జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వారి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ - టి. శ్రీధర్ ను ACB అధికారులు అదుపులోకి తీసుకున్నారు. , "ఫిర్యాదిదారుడి టి.ఎ. బిల్లును ప్రాసెస్ చేయడ...
ACB | మాజీ ఈఎన్‌సి హరిరామ్ షాక్‌..
Crime

ACB | మాజీ ఈఎన్‌సి హరిరామ్ షాక్‌..

ఏసీబీకి ఐదు రోజుల క‌స్ట‌డీ ACB | కాళేశ్వరం లిప్ట్ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టు అవకతవకల కేసులో చంచల్‌ ‌గూడ జైలులో రిమాండ్‌ ‌ఖైదీగా ఉన్న ఈఎన్‌సి భూక్యా హరిరామ్‌ ‌(Hariram)ను ఏసీబీ 5 రోజుల కస్టడీకి తీసుకుంది. ఈనెల 6 వరకు హరిరామ్‌ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో హరిరామ్‌ ‌కీలకంగా వ్యవహరించారు. ఆయనను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విధుల నుంచి సస్పెండ్‌ ‌చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్‌ ‌చీఫ్‌ ఈఎన్‌సీ హరిరామ్‌ ఇం‌ట్లో ఏసీబీ సోదాలు ముగిసిన అనంతరం ఆయనను పోలీసులు న్యాయ‌మూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. విచారణ జరిపిన న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్‌ ‌విధించారు. దీంతో ఆయనను చంచల్‌ ‌గూడ జైలుకు తరలించారు. ACB Raids : సుమారు 200కోట్ల‌కు పైగా అక్ర‌మ ఆస్తులు? మాజీ ఈఎన్‌సి హ‌రిరామ్‌ సుమారు రూ. 200 కోట్లకుపైగా అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర...
అప్పన్న సన్నిధిలో అపశృతి.. గోడకూలి ఏడుగురు భక్తుల మృతి – Simhachalam Temple Tragedy 
Crime

అప్పన్న సన్నిధిలో అపశృతి.. గోడకూలి ఏడుగురు భక్తుల మృతి – Simhachalam Temple Tragedy 

Simhachalam Temple Tragedy  : ‌సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. చందనోత్సవం సమయంలో అప్పన్న సన్నిధిలో అపశృతి చోటుచేసుకుంది. రూ. 300 టికెట్‌ ‌కౌంటర్‌ ‌వద్ద గాలి, వానకు గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సహాయకసిబ్బంది ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని ‌సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను కేజీహెచ్‌ ‌హాస్పిటల్‌కి తరలించారు. Simhachalam : భారీ వర్షంతో కూలిన గోడ సింహాచలం చందనోత్సవం సమయంలో భారీ వర్షం కురియడంతో గోడ కూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ప్రసాదం స్కీం కింద అక్కడ గోడ కట్టారు. అక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నారు. అందులో భాగంగా గోడ నిర్మించారు. ఆ గోడ పక్కన...
error: Content is protected !!