Ocean County : అమెరికాలో భారతీయుడి హత్య కేసు బిగ్ అప్‌డేట్.. ఐదుగురు అరెస్టు
Ocean County : అమెరికాలో ఓ భారతీయుడు హత్యకు గురైన ఘటనలో ఐదుగురు భారత సంతతికి చెందిన వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. 2024 అక్టోబరు 22న లాస్ వెగాస్‌లోని మాంచెస్టర్ టౌన్‌షిప్ వద్ద ఈ హత్య జరిగింది. కుల్దీప్ కుమార్ (35) అనే భారతీయుడు హతమయ్యాడు. ఈ క్రమంలో విచారణ చేపట్టగా సౌత్ ఓజోన్ పార్క్, న్యూయార్క్‌కు చెందిన 34 ఏళ్ల సందీప్ కుమార్ దీనికి సూత్రధారుడని వెల్లడైంది. మరో నలుగురితో కలిసి అతడు ఈ హత్యకు పాల్పడ్డాడని తమ విచారణలో వెల్లడైంది. ఈ మేరకు ఓసియన్ కంట్రీ ప్రాసిక్యూటర్ బ్రాడ్లీ బిల్హైమర్, న్యూజెర్సీ రాష్ట్ర పోలీసు కల్నల్ ప్యాట్రిక్ కాలహాన్ తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. కుల్దీప్ కుమార్ హత్యకు సందీప్ కుమార్ సూత్రధారుడు కాగా మిగతా నిందితులు సౌరవ్ కుమార్ (23), గౌరవ్ సింగ్ (27), నిర్మల్ సింగ్ (30), గురుదీప్ సింగ్ (22)గా కేసు నమోదైందని వివరించారు.వీర...




