Food Poisoning | కామారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం..
Food Poisoning : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా ఫుడ్ పాయిజనింగ్ ఘటన జుక్కల్ మండల కేంద్రంలోని షెడ్యూల్డ్ కులాల బాలుర హాస్టల్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు ఫుడ్‌పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు.
Food Poisoning in Kamareddy District : కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని షెడ్యూల్డ్ కులాల బాలుర హాస్టల్‌లో శుక్రవారం నలుగురు విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. నివేదికల ప్రకారం, నలుగురు విద్యార్థులు మధ్యాహ్న భోజనం తర్వాత కడుపు నొప్పి, వాంతులయ్యాయి. వీరిని సిబ్బంది చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి తీవ్ర కడుపునొప్పి వచ్చి ఆస్పత్రిలో చేరాడు. అన్నం ఉడకపోవడం వల్ల కడుపునొప్పి వచ్చిందని విద్యార్థులకు చికిత్స అందిస్తున్న వైద్యులు ...




