Morphed photos | పవన్ కల్యాణ్ మార్ఫింగ్ ఫొటోలు.. పలు ప్రాంతాల్లో కేసుల నమోదు
Morphed photos : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Deputy Chief Minister Pawan Kalyan)పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మార్ఫింగ్ ఫొటో (Morphed photos)లపై జనసేన పార్టీ కార్యకర్తలు భగ్గమన్నారు. పలు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఈ ఫొటోలను మార్ఫింగ్ చేసి షేర్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.
మహాకుంభామేళాలో పుణ్యస్నానం.. Morphed photos
ప్రయాగరాజ్ మహా కుంభమేళా సందర్బంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకిరా నందన్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. దీని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయ్యాయి. అయితే.. కొందరు సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ చిత్రాలను మార్ఫింగ్ చేసి, ఆయనకు భారీ పొట్ట వచ్చిందని చూపిస్తూ వైరల్ చేశారు....




