Atul Subhash Suicide: అతుల్ సుభాష్ ఆత్మహత్యపై ఆగ్రహ జ్వాలలు.. సోషల్ మీడియాలో #JusticeForRishi ట్రెండింగ్!
                    Atul Subhash Suicide : బెంగళూరులో 34 ఏళ్ల అతుల్ సుభాష్ ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది సోషల్ మీడియాలో ఇప్పుడు #JusticeForRishi #JusticeForAtulSubhashతో Xలో ట్రెండింగ్ అవుతోంది రిషి త్రివేది కూడా సుభాష్ మాదిరిగానే డిసెంబరు 27, 2023న ఆత్మహత్య చేసుకుని మరణించాడని అతని సోదరుడు ఓమ్జీ త్రివేది తెలిపిన ప్రకారం, అతని భార్య "భావోద్వేగ వేధింపుల" కారణంగా మరణించాడు. అని తాజాగాపేర్కొన్నాడు.
అతుల్ సుభాష్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు అతని సోదరుడి విషయంలో ఎలా ఉన్నాయో వివరిస్తూ ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. "అతుల్ సుభాష్ లాగానే, నా సోదరుడు కూడా అతని భార్య శిఖా అవస్తి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. డిసెంబర్ 27, 2023 న, ఆమె క్రూరత్వాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు," అని ఓమ్జీ ఒక X పోస్ట్‌లో రాశారు. .
అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు
అతుల్ సుభాష్ 24 పేజీల నోట్‌లో తన విడ...                
                
             
								



