vaccination| వ్యాక్సిన్ వేయగానే శిశువు మృతి
                    Boy dies after vaccination : వాక్సిన్ తీసుకున్నగంట వ్యవధిలోనే నాలుగు నెలల శిశువు మృతి చెందిన (boy dies) సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట (Jammikunta) మండలం పాపక్కపల్లిలో కలకలం రేపింది. టీకా ప్రభావమేనా లేక వేరే కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ (vaccine) వల్లే తమ బిడ్డ మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా వైద్యులు మాత్రం కారణం అది కాదని అంటున్నారు. ఇతర అనారోగ్య కారణం వల్ల శిశువు మృతి చెంది ఉండొచ్చని వాదిస్తున్నారు.
పాపక్కపల్లి గ్రామానికి చెందిన లింగాల అంజి, హర్షిత దంపతులు తమ నాలుగు నెలల బిడ్డను వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. శిశువుకు ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం అక్కడి వైద్య సిబ్బంది RVV-2 (రోటా వైరస్ వ్యాక్సిన్), Penta-2 (డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్, హెపటైటిస్-బి, Hib కలిపిన టీకా) వేశారు. ఈ టీకాలు సాధారణంగా శిశువు...                
                
             
								



